Air India Plane Crash: మొదటిసారి భర్త వద్దకు వెళ్తూ నవవధువు అనంతలోకాలకు..!

Air India Plane Crash: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటివరకు 204 మంది మరణించినట్లు సమాచారం. ఈ భయంకరమైన విమాన ప్రమాదం మొత్తం దేశాన్ని కుదిపేసింది. ఎంతో మంది కలల్ని కూడా చిదిమేసింది. ఈ ప్రమాదంలో రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలోని అరబా గ్రామానికి చెందిన 21 ఏళ్ల నవ వధువు ఖుష్బూ కూడా మరణించింది. నిండు నూరేళ్ల భర్తతో కలిసి జీవితం పంచుకోవాలని ఆశపడిన నవవధువు కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు విడిచినట్లు తెలిసింది. తమ కూతురు జాడ తెలియక తన కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది.

మొదటిసారి తన భర్తకు వెళుతోన్న నవవధువు
రాజస్థాన్‌కు చెందిన ఖుష్బూకు ఇటీవల వివాహం జరిగింది. ఆమె భర్త లండన్‌లో చదువుకునేందుకు వెళ్లారు. తన భర్త అక్కడికి వెళ్లాక తొలిసారి అతడిని కలిసేందుకు ఈ నవవధువు బయలుదేరింది. ఈ క్రమంలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి ముందు ఖుష్భూ తన తండ్రి మదన్ సింగ్, బంధువుతో కలిసి లండన్ వెళ్లడానికి విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి ఆమె ఎయిరిండియా విమానం ద్వారా లండన్‌కు బయలుదేరాల్సి వచ్చింది. కానీ విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే కూలిపోయింది. ఖుష్బూ జీవితం కూడా ఆ క్షణంలోని ముగిసినట్లు తెలుస్తోంది.

Air India Crash Newlywed Khushboo Dies on First Journey to Meet Husband in London

ఖుష్బూ తండ్రి ఎయిర్‌పోర్టులో తన కుమార్తెకు వీడ్కోలు పలుకుతున్నప్పుడు భావోద్వేగ ఫోటో తీసి వాట్సాప్ స్టేటస్ ‌ల కూడా షేర్ చేశారు. 'ఖుష్బూ బేటా, లండన్‌కు వెళ్తున్నారు' అని రాశారు. కుమార్తె నిష్క్రమణ తర్వాత తండ్రి, బంధువు గ్రామానికి బయలుదేరుతున్నప్పుడు ప్రమాద వార్త వారికి తెలిసింది.

జనవరి 18న వివాహం
ఖుష్బూ ఈ సంవత్సరం జనవరి 18న లండన్‌లో ప్రాక్టీస్ చేస్తున్న జోధ్‌పూర్ జిల్లాలోని లూని ఖరబెరా గ్రామానికి చెందిన డాక్టర్ విపుల్‌తో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత విపుల్ లండన్‌కు తిరిగి వచ్చాడు. ఖుష్బూ కొన్ని నెలలు ఆమె తల్లిదండ్రులు, అత్తమామల ఇంట్లో ఉంది. ఇప్పుడు ఆమె మొదటిసారి లండన్‌లో ఉన్న తన భర్త వద్దకు వెళ్లడానికి విదేశాలకు వెళుతోంది. కుటుంబం ప్రకారం, బయలుదేరే ముందు ఖుష్బూ కళ్ళలో నీళ్ళు తిరిగాయి, ఆమె తల్లిని కౌగిలించుకుని ఏడ్చింది. తండ్రి మదన్ సింగ్ గ్రామంలో ఒక మిఠాయి దుకాణం నడుపుతూ వ్యవసాయం చేస్తాడు. నలుగురు పిల్లలలో ఖుష్బూ పెద్దది.ఆమెకు ఇద్దరు చెల్లెళ్ళు, ఒక సోదరుడు ఉన్నారు. ఈ ప్రమాదం తండ్రిని దుఃఖసాగరంలో ముంచింది. . ఈ ప్రమాదం కొత్తగా పెళ్లైన ఆ అమ్మాయి కలలను బద్దలు కొట్టింది. తండ్రి ప్రపంచాన్ని నాశనం చేసింది. ఈ ఘటన తర్వాత గ్రామంలో శోకసంద్రం అలముకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+