వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానాన్ని ఢీ కొన్న ప‌క్షి.. మ‌ణిపూర్ సీఎం స‌హా 160 మందికి త్రుటిలో త‌ప్పిన ప్ర‌మాదం

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

గౌహతి: దిల్లీ-గౌహతి-ఇంఫాల్‌ ఎయిరిండియా విమానానికి శుక్రవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. 160 మందితో ప్రయాణిస్తున్న విమానం గౌహతి విమానాశ్రయంలో దిగుతుండగా విమానాన్ని ఓ పక్షి ఢీకొంది.

దీంతో విమానంలోని ముందు భాగం కొంత పాడైపోయినప్పటికీ పైలట్ చాకచక్యంగా విమానాన్ని దించేశారు. ఈ ప్రమాదం కారణంగా విమానం గౌహతిలోనే ఆగిపోయింది. దీంతో ఇంఫాల్‌ వెళ్లాల్సిన ప్రయాణికులు గౌహతి విమానాశ్రయంలో వేచి ఉండాల్సి వచ్చింది.

 Air India Flight With 160 Aboard Suffers Bird Hit While Landing In Guwahati

ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానంలో మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ సహా 160 మంది ప్రయాణికులు ఉన్నారని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ప్రకటించారు.

తాను ప్రయాణిస్తున్న ఎయిరిండియా విమానానికి పక్షి తగిలిందని, గౌహతిలో సురక్షితంగా ల్యాండ్‌ అయిందని శుక్రవారం బీరేన్‌ ట్వీట్‌ చేశారు. ఎయిరిండియా అధికార ప్రతినిధి కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. విమానాన్ని తమ ఇంజనీర్ల బృందం పరిశీలిస్తోందని చెప్పారు.

అయితే గౌహతి విమానాశ్రయంలో ఎయిరిండియా మేనేజ్‌మెంట్‌ అస్సలు బాగోలేదని ముఖ్యమంత్రి బీరేన్‌ మరో ట్వీట్‌లో తెలిపారు. చాలా మంది ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారని, ఆహారం వసతి ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు.

ముగ్గురు ఎయిరిండియా సిబ్బంది మాత్రమే ఇక్కడ ఉన్నారని, శనివారం మధ్యాహ్నం వరకు మరో విమానం కూడా అందుబాటులో లేదని సంస్థ అధికారులు తెలిపినట్లు బీరేన్‌ వెల్లడించారు. మరోవైపు పరిస్థితి చక్కదిద్దేందుకు ఎయిరిండియా అన్ని విధాలా ప్రయ్నతిస్తోందని ఆ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు.

English summary
Around 160 passengers, including Manipur Chief Minister Nongthombam Biren, had a close shave when their Air India flight suffered a bird hit while landing at the airport in Guwahati. The Delhi-Guwahati-Imphal flight was grounded yesterday and passengers travelling to Imphal were left stranded."Our AI flight was hit by a flying bird and airplane landed safely in Guwahati today," Mr Biren tweeted yesterday. An Air India spokesperson confirmed the incident and said the flight carrying 160 passengers was grounded for inspection by a team of engineers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X