జేఎన్‌యూ ఇష్యూ: ఏబీవీపీతో అక్షత్‌కు సంబంధం లేదు, విచారణకు పోలీసులకు కో ఆపరేట్ చేస్తాం
జేఎన్‌యూలోని సబర్మతి హాస్టల్ వద్ద వామపక్ష విద్యార్థుల దాడి చేసింది తామేనని అక్షత్, రోహిత్ 'ఇండియా టుడే' స్టింగ్ ఆపరేషన్‌లో అంగీకరించిన నేపథ్యంలో దుమారం చెలరేగింది. దీంతో ఏబీవీపీ స్పందించింది. అక్షత్, రోహిత్‌తో ఏబీవీపీకి ఎలాంటి సంబంధం లేదని ఒక ప్రకటనలో తెలిపింది.
అక్షత్ తాను ఏబీవీపీ కార్యకర్తనని రిపోర్టర్‌తో చెప్పడంతో సంచలనం కలిగించింది. అయితే దీనిపై ఏబీవీపీ ప్రధాని కార్యదర్శి నిధి త్రిపాఠి స్పందించారు. జేఎన్‌యూ దాడితో ఏబీవీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అక్షత్ ఏబీవీపీ కార్యకర్త కాదని.. అతనికి ఏబీవీపీతో సంబంధం ఉందని ముద్రవేసి, హింసకు పాల్పడిందని ఏబీవీపీ అని నిందించడం తప్పు అన్నారు. అంతేకాదు జేఎన్‌యూ దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నారని గుర్తుచేశారు. ఘటన మొత్తం నిష్ఫాక్షిపాతంగా విచారించాలని తాము కోరుతున్నామని చెప్పారు.

జేఎన్‌యూ ఘటనపై విచారణ జరిపేందుకు ఢిల్లీ పోలీసులు, జేఎన్‌యూ పరిపాలన విభాగానికి తాము పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. అక్షత్ గురించి మీడియా ప్రతినిధులు మరోసారి ప్రశ్నించగా.. అలాంటి వారు ఎవరూ ఏబీవీపీలో లేరని, ఏబీవీపీలో ఉన్నారని ఎవరైనా చెబితే, దర్యాప్తు జరిపించాలని కోరారు. అంతేకాదు తప్పు చెప్పినందుకు బాధ్యత కూడా వహించాలని ఆమె అన్నారు. ఏబీవీపీతో అక్షత్‌కు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications