కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఉన్న దొంగలు అందరూ మీటింగ్ పెట్టి !
బెంగళూరు/విజయపురం: లోక్‌సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న తరుణంలో బెంగళూరులో ప్రతిపక్ష పార్టీల సంయుక్త సమావేశాలు జరుగుతున్న సందర్బంగా కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ బసవన గౌడ పాటిల్ యత్నాల్ మండిపడుతున్నారు. మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న దొంగలు అందరూ బెంగళూరులో కలిశారని మండిపడ్డారు.
2024లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఓడించేందుకు ఈ ప్రతిపక్షాలు అన్ని కలిసి వస్తున్నాయని, దేశంలో బెయిల్‌పై ఉన్న కుటుంబాలన్నీ ఒక్కటి అవుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ విరుచుకుపడ్డారు. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి అవుతారని, ఈ బెయిల్ మీద ఉన్న నిందితులు అందరూ జైలుకు వెలుతారనే భయంతో ఈ దొంగలంతా ఒక్కతాటిపైకి రావడంతో తమాషాగా ఉందని బీజేపీ ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ యత్నాల్ విమర్శించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలైంది. కరువు విలయతాండవం చేస్తోందని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని, పేదల ఆందోళనలు పెరిగిపోయాయని, హిందూ కార్యకర్తలను హత్యలు చేశారని, అయినా సిద్దరామయ్య ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యే బసవన గౌడ పాటిల్ యత్నాల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఇంత జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్షంగా ఉంటున్న కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ తరుణంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఆయన మంత్రివర్గం విపక్షాల సమావేశాలు నిర్వహిస్తూ బిజీబిజీగా ఉన్నారని, వారికి రైతుల ప్రాణాల కంటే రాజకీయాలే ముఖ్యం అని, ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని మాజీ ముఖ్యమంత్రి బసవరాజ బోమ్మయ్ కూడా ఇప్పటికే ఆరోపించారు.

రుతుపవనాల వైఫల్యంతో రైతులు వేసిన పంటలు మొలకెత్తలేదని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ట్వీట్ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకోకపోవడం లేదని, ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే 2013-18లో అత్యధికంగా జరిగిన రైతు ఆత్మహత్యలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మరోసాసరి పునరావృతం కానున్నాయని తెలుస్తోందని మాజీ సీఎం బసవరాజ్ బోమ్మయ్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications