జైలుకు శశికళ: సీన్‌లోకి ఆమె భర్త నటరాజన్, జయ వెలేసినా...
శశికళ జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆమె భర్త నటరాజన్ సీన్‌లోకి వచ్చారు. తమ కుటుంబ సభ్యులంతా శశికళ కోసం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు.
చెన్నై: దివంగత నేత జయలలిత మరణానంతరం ముఖ్యమంత్రి పీఠం కోసం పాకులాడి చివరకు జైలు పాలైన శశికళ కుటుంబ సభ్యులు తిరిగి తెర మీదికి వచ్చారు. శశికళ ఇద్దరు మేనల్లుళ్లు కూడా అన్నాడియంకెలోకి వచ్చారు. వారిద్దరిని గతంలో జయలలిత బహిష్కరించారు.
తాజా తమిళనాడు రాజకీయ డ్రామాలో శశికళ కుటుంబ సభ్యులు కీలకమైన పాత్ర పోషించారనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తాను శశికళతో టచ్‌లో ఉన్నట్లు ఆమె భర్త నటరాజన్ ఎన్డీటివీతో చెప్పారు. నటరాజన్‌తో పాటు దాదాపు డజను మందిని జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి పంపించి వేశారు.

ఎన్డిటీవి కథనం ప్రకారం - భర్తతో పాటు కుటుంబ సభ్యులందరితో తెగదెంపులు చేసుకుంటానని హామీ ఇచ్చిన తర్వాతనే జయలలిత శశికళను దగ్గరకు రానిచ్చారు. తాను శశికళతో టచ్‌లో ఉన్నానని, కోర్టులో లొంగిపోయే సమయంలో కలవడానికి బెంగళూరు వెళ్లేందుకు విమానాశ్రయం వెళ్తున్నానని నటరాజన్ ఎన్డీటివితో చెప్పారు.
టిటివి దినకరన్‌ను, వెంకటేష్‌ను 2011లో జయలలిత బహిష్కరించారు. వారిద్దరు కూడా తిరిగి అన్నాడియంకెలోకి వచ్చారు. వారిని తిరిగి తీసుకోవాలనేది పార్టీ నిర్ణయమని నటరాజన్ చెప్పారు. తాను శశికళ పక్కనే ఉంటానని కూడా చెప్పారు.
ఇటీవల తాను అన్నాడియంకె ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనప్పుడు తన పేరు వెనక నటరాజన్ అనే పేరును తీసేసి, ముందు వికె అని చేర్చుకున్నారు.












Click it and Unblock the Notifications