జయలలిత కోసం చెన్నై చేరుకున్న అమిత్ షా, అరుణ్ జైట్లీ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే చీఫ్ జయలలితను పరామర్శించడానికి కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెన్నై చేరుకున్నారు.
బుధవారం మద్యాహ్నం 3 గంటలకు అరుణ్ జైట్లీ, అమిత్ షా అపోలో ఆసుపత్రి చేరుకుని జయలలితను పరామర్శించనున్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, అమిత్ షా వెంట బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలు తమిళ్ సై సౌందరరాజన్ ఆసుపత్రికి వెలుతున్నారు.

తమిళనాడు బీజేపీ నాయకులు సైతం అపోలో ఆసుపత్రి చేరుకుని తమిళనాడు సీఎం జయలలితను పరామర్శించనున్నారు. గత రెండు వారాలకు పైగా జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అపోలో ఆసుపత్రి చేరుకుని జయలలిత ఆరోగ్యం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సైతం అపోలో ఆసుపత్రి చేరుకుని జయలలిత ఆరోగ్యం గురించి వైద్యులతో సంప్రధించి వివరాలు సేకరించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications