వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీకి ఎన్నిసీట్లు వస్తాయి, గొప్పలు చెప్పిన సొంత పార్టీ నేతలకు అమిత్ షా దగ్గర చివాట్లు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా దగ్గర గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నించిన కర్ణాటకకు చెందిన ఆ పార్టీ నేతలు చివరికి చివాట్లు తిన్నారని వెలుగు చూసింది. 2018 శాసన సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వివాదంలో అమిత్ షా, మఠాధిపతికి ఇచ్చే గౌరవం ఇదేనా, దక్షిణ భారతీయులంటే, వైరల్!వివాదంలో అమిత్ షా, మఠాధిపతికి ఇచ్చే గౌరవం ఇదేనా, దక్షిణ భారతీయులంటే, వైరల్!

2018 శాసన సభ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రధాని మోడీ లక్షంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల కర్ణాటక పర్యటన చేపట్టారు. సోమవారం రాత్రి అమిత్ షా ఢిల్లీ బయలుదేరుతున్నారు.

150 సీట్లు గ్యారెంటీ !

150 సీట్లు గ్యారెంటీ !

కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థి అయిన బీఎస్. యడ్యూరప్పతో సహ కీలకనేతలతో అమిత్ షా భేటీ అయ్యారు. 2018 శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయని అమిత్ షా ప్రశ్నించారని సమాచారం. ఆ సందర్బంలో కచ్చితంగా 150కి పైగా ఎమ్మెల్యేలు సీట్లు మనకే వస్తాయని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేశారని తెలిసింది.

ఇప్పుడు ఎన్నికలు జరిగితే ?

ఇప్పుడు ఎన్నికలు జరిగితే ?

అమిత్ షా అప్పటికే సిద్దం చేసి తీసుకెళ్లిన మూడు నివేదికలు కర్ణాటక బీజేపీ నాయకులు ముందు పెట్టారని సమాచారం. ఇప్పటికిప్పుడు కర్ణాటకలో ఎన్నికలు జరిగితే 80 సీట్లకు మించి మనం గెలుచుకోలేమని అమిత్ షా అందరికీ క్లాస్ పీకారని తెలిసింది.

కట్రలు, కుతంత్రాలు వద్దు

కట్రలు, కుతంత్రాలు వద్దు

అభిప్రాయవిభేదాలు పక్కన పెట్టి ఇప్పటి నుంచి శాసన సభ ఎన్నికల కోసం సిద్దం కావాలని, కచ్చితంగా అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చెయ్యాలని కర్ణాటక బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అమిత్ షా క్లాస్ ఇచ్చారని తెలిసింది.

పార్టీ కంటే ఎవ్వరూ గొప్పకాదు

పార్టీ కంటే ఎవ్వరూ గొప్పకాదు

కర్ణాటక నాయకుల తీరుపై అమిత్ షా తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. పార్టీ కంటే ఎవ్వరూ ఇక్కడ గొప్పకాదని, అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే మళ్లీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని అందరూ గుర్తు పెట్టుకోవాలని అమిత్ షా సూచించారని తెలిసింది.

సహకరించండి

సహకరించండి

బీజేపీ నాయకులతో పాటు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, విశ్వహిందూ పరిషత్, శ్రీరామసేన, భజరంగ్ దళ్ తో సహ అనేక హిందూ సంఘ సంస్థల నాయకులతో అమిత్ షా సమావేశం అయ్యారు. 2018 శాసన సభ ఎన్నికల్లో బీజేపీకి అందరూ మద్దతు ఇవ్వాలని అమిత్ షా మనవి చేశారని సమాచారం.

English summary
The BJP's national chief, Amit Shah decided to give his party in Karnataka a reality check. Armed with three survey reports, he asked the BJP leaders in Karnataka how many seats would they win if the state went to polls today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X