బీజేపీ ఉంటే సేఫ్, కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే అల్లర్లు గ్యారెంటీ, అమిత్ షా !
బెంగళూరు/బెళగావి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నిమగ్నం అయిన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే గొడవలు ఎక్కువ అవుతాయని, కర్ణాటకలో లేనిపోని సమస్యలు వస్తాయని అమిత్ షా డైరెక్ట్ గా చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం బాగల్ కోటేలో జిల్లాలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న అమిత్ షా తరువాత బహిరంగ సభలో మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో గొడవలు ఎక్కువ అవుతాయని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.

కర్ణాటకలో వంశపార్య రాజకీయాలు కావాలని కన్నడిగులు కోరుకుంటున్నారా ? అంటూ అమిత్ షా ఓటర్లను ప్రశ్నించారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అభివృద్ది రివర్స్ గేర్ లోకి వెళ్లిపోతుందని, అందులో ఎలాంటి డౌట్ లేదని, కాంగ్రెస్ తో ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజులవంశం నాటి పాలన వస్తుందని కన్నడిగులను అమిత్ షా హెచ్చరించారు. కర్ణాటకలో ముస్లీంలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లను బసవరాజ్ బోమ్మయ్ ప్రభుత్వం రద్దు చెయ్యడాన్ని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా సమర్థించుకున్నారు. మతం పేరుతో రిజర్వేన్లు ఇస్తే ఎవ్వరికి లాభం ఉండదని, పేదలకు మాత్రమే రిజర్వేషన్లు అమలు అయ్యేలా తాము చేస్తామని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచార బహిరంగ సభలో చెప్పారు.












Click it and Unblock the Notifications