భార్య వదిలేసింది, పోలీసు ఉద్యోగం ఊడిపోయింది, మద్యం మత్తులో బెడ్ రూమ్ లో ఉన్న తల్లిని ?

ఎస్ఐ కావలసిన కిరాతకుడు ఇంట్లో కన్న తల్లి మీద అత్యాచారం చేశాడు. తల్లి విషయం బయటకు చెబుతుందనే భయంతో దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

చెన్నై/రాణిపేట్: ఓ తల్లి ఆమె కొడుకును డిగ్రీ వరకు చదివించింది. డిగ్రీ పూర్తి చేసిన యువకుడు పోలీసు శాఖలో కానీస్టేబుల్ గా ఉద్యోగంలో చేరాడు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న యువకుడికి మంచి అమ్మాయితో పెళ్లి జరిగింది. పోలీసు దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. త్వరలో ఆ పోలీసు ఎస్ఐ అవుతుడాని అందరూ అనుకున్నారు. తరువాత సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. ఎస్ఐ కావలసిన కిరాతకుడు ఇంట్లో కన్న తల్లి మీద అత్యాచారం చేశాడు. తల్లి విషయం బయటకు చెబుతుందనే భయంతో దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

పోలీసు ఉద్యోగం

పోలీసు ఉద్యోగం

తమిళనాడులోని రాణిపేట్ జిల్లాలోని ఆర్కాడ్ (ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలోని వేలూరు జిల్లా పక్కన) సమీపంలోని చక్కమల్లూర్ గ్రామంలో దినేష్ (32) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. దినేష్ కు తల్లి వాణిశ్రీ ఉంది. కొడుకు దినేష్ ను బాగా చదివించిన వాణిశ్రీ అతను ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంటే చూడాలని అనుకుంది. వాణిశ్రీ అనుకున్నట్లే దినేష్ కు తమిళనాడు పోలీసు శాఖలో కానీస్టేబుల్ గా ఉద్యోగం వచ్చింది. వాణిశ్రీకి ప్రియా అనే కుమార్తె ఉంది. వివాహం చేసుకున్న ప్రియా ఆమె భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరులో ఉంటున్నది.

భార్య వదిలేసింది

భార్య వదిలేసింది

పోలీసు ఉద్యోగం చేస్తున్న దినేష్ కు పిల్లను ఇచ్చి పెళ్లి చెయ్యడానికి చాలా మంది ముందుకు వచ్చారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న దినేష్ కు ప్రియాంకా అనే యువతితో వివాహం అయ్యింది, దినేష్, ప్రియాంకా దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే రానురాను దినేష్, ప్రియంకా దంపతుల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. పెద్దలు, గ్రామస్తులు పంచాయితీలు చేసినా ఫలితం లేకపోవడంతో దినేష్, ప్రియాంక దంపతులు విడిపోయారు.

ఉద్యోగం ఊడిపోయింది

ఉద్యోగం ఊడిపోయింది

ప్రియాంకా ఆమె ఇద్దరు కుమార్తెలతో కలిసి పుట్టింటిలో ఉంటున్నది, భార్య ప్రియాంకాను వదిలేసిన దినేష్ పోలీసు ఉద్యోగం చేస్తూ ప్రతినెల జీతం తీసుకుంటూ హ్యాపీగానే ఉండేవాడు. పోలీసు శాఖలో పన చేస్తున్న దినేష్ త్వరలో ఎస్ఐ అవుతాడని అందరూ అనుకున్నారు. అయితే పరిస్థితులు మొత్తం తారుమారు అయ్యాయి. అవినీతి ఆరోపణలు. లంచాలు తీసుకుంటున్నాడని, పై అధికారులతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ కానీస్టేబుల్ దినేష్ ను సస్పెండ్ చేశారు.

తల్లిని రేప్ చేసి చంపేసిన కామాంధుడు

తల్లిని రేప్ చేసి చంపేసిన కామాంధుడు

ఉద్యోగం పోవడంతో సొంత గ్రామానికి చేరుకున్న దినేష్ ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం సేవిస్తూ కాలం గడుపుతున్నాడు. ఇంటిలో ఒంటరిగా ఉంటున్నన తల్లి వాణిశ్రీతో నిత్యం గొడవలు పడుతున్నాడు. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన దినేష్ బెడ్ రూమ్ లో నిద్రపోతున్న తల్లి మీద అత్యాచారం చేశాడు. తరువాత తల్లి విషయం బయటకు చెబితే జైలుకు పోతానని భయపడిన దినేష్ అతని తల్లిని చంపేశాడు.

కూతురుకు డౌట్ వచ్చింది

కూతురుకు డౌట్ వచ్చింది

వాణిశ్రీ ప్రతిరోజు ఆమె కూతురు ప్రియాతో మాట్లాడుతోంది. అయితే రెండు రోజుల నుంచి తల్లి వాణిశ్రీ నుంచి ఫోన్ కాల్స్ రాకపోవడం, ఫోన్ చేసినా ఆమె రిసీవ్ చెయ్యకపోవడంతో ప్రియాకు అనుమానం వచ్చి నేరుగా పుట్టింటికి వెళ్లింది. ఆ సందర్బంలో తల్లి వాణిశ్రీ ఇంట్లో శవమై కనిపించడంతో హడలిపోయిన ప్రియా పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వాణిశ్రీ శవాన్ని పోస్టుమార్టుంకు తరలించారు.

వీడు మనిషి కాదు

వీడు మనిషి కాదు

పోలీసులు మద్యం మత్తులో ఉన్న మాజీ పోలీసు దినేష్ ను అదుపులోకి తీసుకున్నారు. తన తల్లి మీద అత్యాచారం చేసి తానే హత్య చేశానని దినేష్ చెప్పడంతో అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు హడలిపోయారు. దినేష్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని రాణిపేట్ జిల్లా పోలీసులు తెలిపారు. మద్యం మత్తులో కన్నతల్లి మీద అత్యాచారం చేసిన మాజీ పోలీసు ఆమెను హత్య చెయ్యడం తమిళనాడులో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+