college: కాలేజ్ లో ఓల్డ్ స్టూడెంట్ ఓవర్ యాక్షన్, టార్గెట్ లేడీస్ టాయిలెట్, మొబైల్ ఫోన్ తో ?, ఢమాల్ !

కాలేజ్ లోని లేడీస్ టాయిలెట్ లో సీక్రేట్ గా దాచిపెట్టిన మొబైల్ ఫోన్ చూసిన కాలేజ్ అమ్మాయిలు హడలిపోయారు. ఇంతకాలం మనం వాష్ రూమ్ కు వచ్చి వెలుతున్న వీడియోలు రికార్డు అయి ఉంటాయని అమ్మాయిలు హడలిపోయారు.

బెంగళూరు/జయనగర్: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలా క్లోజ్ గా ఉండటం మామూలుగానే ఉంటుంది. కాలేజ్ లో చదువుతున్న అమ్మాయిలు, అబ్బాయిలకు ఆ కాలేజ్ క్యాంపస్ గురించి పూర్తి సమాచారం ఉంటుంది. కాలేజ్ క్యాంపస్ లో ఎక్కడ క్లాస్ రూమ్ లు ఉంటాయి, ఎక్కడ బాత్ రూమ్ లు ఉంటాయి, ఎక్కడ లైబ్రరి ఉంటుంది అంటూ అన్ని తెలిసి ఉంటాయి. కాలేజ్ లోని లేడీస్ టాయిలెట్ లో సీక్రేట్ గా దాచిపెట్టిన మొబైల్ ఫోన్ చూసిన కాలేజ్ అమ్మాయిలు హడలిపోయారు. ఇంతకాలం మనం వాష్ రూమ్ కు వచ్చి వెలుతున్న సమయంలో వీడియోలు రికార్డు అయిఉంటాయని, వాటిని ఎంతో మందికి షేర్ చేసి ఉంటారని అమ్మాయిలు హడలిపోయారు.

ప్రైవేట్ కాలేజ్ లో ?

ప్రైవేట్ కాలేజ్ లో ?

ఓ ప్రైవేట్ కాలేజీలోని టాయిలెట్‌లో తన మొబైల్ ఫోన్‌ను రహస్యంగా ఉంచి విద్యార్థినులపై అసభ్యకర వీడియోలు తీసిన అదే కళాశాలకు చెందిన ఓల్డ్ స్టూడెంట్ ను బెంగళూరులోని జయనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరంలోని ఐటీపీల్ సమీపంలోని వైట్‌ఫీల్డ్‌కు చెందిన ఓ యువకుడిని అరెస్టు చేసి అతన్ని విచారణ చేస్తున్నామని పోలీసు అధికారులు అంటున్నారు.

కాలేజ్ లో ఏం జరిగింది ?

కాలేజ్ లో ఏం జరిగింది ?

బెంగళూరు నగరంలోని జయనగర్ 7 బ్లాక్ సమీపంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఈ సంఘటన జరిగింది. కాలేజీలో సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత వియం బయటకు వచ్చింది. కాలేజీ ప్రిన్సిపాల్ ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్ చేసినట్లు జయనగర పోలీసు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 17వ తేదీన కాలేజ్ మొదటి అంతస్తులో ఉన్న విద్యార్థినుల టాయిలెట్‌లోకి వెళ్లిన నిందితుడు పక్కనే ఉన్న టాయిలెట్‌లో తన మొబైల్ ఫోన్‌ను ఉంచి విద్యార్థినులపై అసభ్యకర వీడియోలు చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు.

కేకలు వేసిన అమ్మాయిలు

కేకలు వేసిన అమ్మాయిలు

దీంతో ఓ అమ్మాయి టాయిలెట్‌లో మొబైల్ ఫోన్‌ను చూసి పెద్దగా కేకలు వేసింది. ఈ అరుపు విన్న కొందరు విద్యార్థినులు భయంతో ఏం జరిగిందో అంటూ వెంటనే టాయిలెట్‌లోకి వెళ్లారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. విద్యార్థినులు ఆ యువకుడిని పట్టుకున్నారు. అనంతరం అతని మొబైల్‌ను తనిఖీ చేయగా, మొబైల్‌లో విద్యార్థిని అసభ్యకర చిత్రం కనిపించాయి.

శాడిస్టు మాజీ స్టూడెంట్

శాడిస్టు మాజీ స్టూడెంట్

కాలేజ్ ప్రిన్సిపాల్ జయనగర్ పోలీసులకు సమాచారం అందించార. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని అరెస్టు అయ్యాడు. ఆ కాలేజీలో గ్రాడ్యుయేషన్ మధ్యలో మానేసిన యువకుడు ఉద్యోగం లేకుండా ఖాలీగా తిరుగుతున్నాడని, కాలేజ్ యాజమాన్యం అతని మార్కు షీట్ లు ఇవ్వకుండా తిప్పుతున్నారని, అందుకే అతను ఈ చర్యకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో వాంగ్మూలం ఇచ్చాడని పోలీసులు అంటున్నారు. అయితే నిందితులకు మార్కుల జాబితా ఇవ్వనందుకు ఇలా చెయ్యలేదని, అతనికి తప్పుడు ఉద్దేశం ఉందని, అందుకే ఇలా చేశాడని కళాశాల ప్రిన్సిపాల్‌ అంటున్నారని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+