ఆంధ్రా బ్యాంకుకు కుచ్చు టోపి: ఐదుగురికి జైలు శిక్ష
థానె: నకిలి డాక్యుమెంట్లు తయారు చేసి ఆంధ్రా బ్యాంకులో సమర్పించి హోం లోన్ తీసుకుని మోసం చేసిన వారిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన ఐదుగురిలో దంపతులు కూడా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు.
ప్రశాంత్ బాగ్వే, ప్రతిజ్ఞా బాగ్వే (దంపతులు), రవిపాటిల్, సంకేత్ కాంబ్లే, అజయ్ ఆంగ్రే అనే ఐదుగురిని అరెస్టు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. వీరి నుండి పలు డాక్యుమెంట్లు, నకిలీ రబ్బర్ స్టాంప్ లు స్వాధీనం చేసుకున్నారు.

థానె లోని డొంబివాలి ప్రాంతంలో ఉన్న వీనస్ కో - ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో తాను ఒక ప్లాట్ కొన్నానని ప్రశాంత్ బాగ్వే నకిలీ డాక్యూమెంట్లు సృష్టించాడు. తరువాత ప్రభుత్వానికి చెందిన నకిలి రబ్బర్ స్టాంప్ లు తయారు చేయించాడు. డాక్యూమెంట్లు, రబ్బర్ స్టాంప్ లతో కొన్ని నకిలి పత్రాలు తయారు చేశాడు.
వాటిని తీసుకు వెళ్లి ఆంధ్రా బ్యాంకులో సమర్పించి రూ. 10 లక్షలు హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ప్రశాంత్ బాగ్వేకి అతని, భార్య, మిగిలిన వారు సహకరించారు. అదే విధంగా సంజయ్ అఖాడే అనే వ్యక్తికి ఇలాంటి డాక్యుమెంట్లు ఇచ్చి రూ. 60 వేలు తీసుకున్నారు. బ్యాంకు సిబ్బంది ఫిర్యాదు చెయ్యడంతో పోలీసులు ఈ ఐదుగురిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications