భార్య మీద పగ, ప్రతీకారం, అర్దరాత్రి చేతబడి ఎక్కడ చేయించాడంటే ?, వీడు మాత్రం !
బెంగళూరు/చిక్కమగళూరు: భర్తతో గొడవపడి భార్య పుట్టింటికి వెళ్లిందనే కారణంతో భర్త రగిలిపోయాడు. భార్య మీద పగ తీర్చుకోవాలని ఆమె భర్త డిసైడ్ అయ్యాడు. భార్య ఇంటికి ఆమె భర్త చేతబడి చేయించాడని ఆరోపణలు ఉన్నాయి. ఉదయం నిద్రలేచిన భార్య కుటుంబ సభ్యులు ఇంటి ముందు రక్తం, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఇనుప మేకులు చూసి బిత్తరపోయారు.
కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ముదిగెరె తాలూకా బనకల్ సమీపంలోని మట్టికట్టె గ్రామంలో భార్య ఇంటికి ఆమె భర్త చేతబడి చేయించాడని కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు.బనకల్ సమీపంలోని మట్టికట్టె గ్రామానికి చెందిన సతీష్ అతని చెల్లెలు సుమిత్రాను మరసానిగె గ్రామానికి చెందిన గురుమూర్తితో 12 ఏళ్ల క్రితం వివాహం జరిపించాడు.

వివాహం అయిన తరువాత గురుమూర్తి, సుమిత్రా దంపతులు చాలా సంవత్సరాలు హ్యాపీగా ఉన్నారు. అయితే తరువాత గురుమూర్తి, సుమిత్రా దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పెద్దలు రాజీలు, పంచాయతీలు చేస్తూనే ఉన్నా గురుమూర్తి, సుమిత్రా దంపతులు మాత్రం వారి పద్దతి మార్చుకోలేదని తెలిసింది.
నెల రోజుల క్రితం భార్యాభర్తల మధ్య మరో గొడవ జరగడంతో సుమిత్రా ఆమె అన్న సతీష్ ఇంటికి వెళ్లింది. దీంతో ఆగ్రహించిన భర్త గురుమూర్తి, సుమిత్రా అన్నయ్య సతీష్ కు ఫోన్ చేసి నా భార్యను నా ఇంటికి పంపించాలని చెప్పాడు. తరువాత తెల్లవారుజామున 4 గంటలకు బావ సతీష్ ఇంటికి వెళ్లిన గురుమూర్తి అతని భార్య సుమిత్రాను ఇంటికి తీసుకెలుతానని చెప్పాడు.
తరువాత గురుమూర్తి, సుమిత్రా దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కత్తి చూపించిన గురుమూర్తి మిమ్మల్ని చంపేస్తానని భార్య సుమిత్రా, బావ సతీష్ తో పాటు అతని కుటుంబ సభ్యులను బెదిరించాడు. తరువాత సతీష్ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లి పోయారు. గురుమూర్తి ఇంటి బయటే ఉన్నా ఏమాత్రం పట్టించుకోని సుమిత్రా కూడా ఆమె అన్న ఇంటిలోకి వెళ్లిపోయింది.

అర్దరాత్రి సతీష్ కిటికీ తెరిచి చూడగా ఇంటి ముందు కుర్చున్న గురుమూర్తి ఏడుపు కనిపించింది. కొంతసేపటికి సతీష్ తలుపు తెరిచి బయటకు వచ్చాడు. అయితే అప్పటికే గురుమూర్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం 6 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రాగా ఇంటి ముందు ఏదో జంతువు రక్తం చల్లిఉండటం, పసుపు కుంకుమతో పాటు నిమ్మకాయలు కనపడటంతో అదరూ హడలిపోయారు. తన ఇంటికి చేతబడి చేశారని సతీష్ గుర్తించాడు.
గురుమూర్తి చూపిన కత్తిని కూడా ఇంటి ముందే విసిరేసి ఉండటంతో సతీష్ కు ఇంకా అనుమానం వచ్చింది. ఇంట్లో భార్య సుమిత్రాకు మొదట మాయమాటలు చెప్పి చంపేస్తానని బెదిరించిన తన సోదరి సుమిత్రా భర్త గురుమూర్తిపై తగుచర్యలు తీసుకోవాలని సతీష్ బనకల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన బనకల్ పోలీసులు నిందితుడు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !!












Click it and Unblock the Notifications