ఎయిరిండియా, విస్తారా ఫ్లైట్‌కు బాంబు బెదిరింపు- కలకలం

Air India Express flight: దేశంలో పౌర విమానయాన సంస్థలకు బాంబు బెదిరింపులు తీవ్రతరం అయ్యాయి. ఈ మధ్యకాలంలో వరుసగా ఇలాంటి బెదిరింపులు అందుతోన్నాయి. రెండు వారాల వ్యవధిలో ఎనిమిది విమానాలకు ఇలాంటి ఇ-మెయిల్స్ అందాయి. ప్రయాణికులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేశాయి.

ఇప్పుడు తాజాగా మరోసారి అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. దుబాయ్ నుంచి భారత్‌కు వస్తోన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు అందింది. ఈ మేరకు గుర్తు తెలియని ఐపీ అడ్రస్ నుంచి ఇ-మెయిల్ అందింది. ఈ విషయాన్ని ఎయిరిండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ధృవీకరించింది.

Another Air India Express flight received a bomb threat

ఐఎక్స్ 196 విమానం అది. 189 మంది ప్రయాణికులు, సిబ్బందితో దుబాయ్ నుంచి బయలుదేరి రాజస్థాన్ రాజధాని జైపూర్‌కు బయలుదేరింది. మార్గమధ్యలో ఉన్నప్పుడే అంటే శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత 12:45 నిమిషాలకు బాంబు బెదిరింపు ఇమెయిల్ అందింది.

1:20 నిమిషాలకు జైపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన.. వెంటనే విమానం మొత్తాన్నీ క్షున్నంగా తనిఖీ చేశారు. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గానీ, పేలుడు పదార్థాలు గానీ లభించలేదని జైపూర్ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సందీప్ బసేరా తెలిపారు. దీనితో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఎయిరిండియా విమానాలకు బాంబు బెదిరింపులు అందడం వరుసగా ఇది ఆరో రోజు కావడం గమనార్హం. ఢిల్లీ- లండన్ విస్తారా విమానానికి బెదిరింపులు అందడంతో ఫ్రాంక్‌‌ఫర్ట్‌కు మళ్లించాల్సి వచ్చింది. శుక్రవారం ఢిల్లీ నుంచి లండన్ బయలుదేరి వెళ్లిన యూకే 17 విస్తారా విమానంలో బాంబులు పెట్టినట్ల బెదిరింపులు అందడంతో దాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ల్యాండ్ చేశారు.

అంతకుముందు ఆకాశ ఎయిర్‌వేస్ విమానం క్యూపీ 1366కు బెదిరింపులు అదాయి. బెంగళూరు నుంచి ముంబై బయలుదేరి వెళ్లాల్సిన విమానం ఇది. టేకాఫ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు గుర్తు తెలియని వ్యక్తులు ఎక్స్ హ్యాండిల్ ద్వారా బెదిరించడం వల్ల వల్ల ఆలస్యంగా ఇది బయలుదేరాల్సి వచ్చింది. ఎయిరిండియాకు చెందిన 40 విమానాలకు ఇలా బెదిరింపులు అందాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+