మరో ఆత్మహుతి దాడికి ఉగ్రవాదుల ప్లాన్ : భారత్ -పాక్ సరిహద్దులో హై టెన్షన్

న్యూఢిల్లీ : వైమానిక దళ దాడులతో ఉప ఖండంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వాయుసేన దాడులతో తీవ్రంగా దెబ్బతిన్న పాకిస్థాన్ మరో దాడికి ప్రణాళిక రచించినట్టు నిఘా వర్గాలు తెలిపాయి. సరిహద్దులో అప్రమత్తంగా ఉండాలని .. ఏమరుపాటు పనికిరాదని అన్ని విభాగాలను హెచ్చరించాయి.

పుల్వామా తరహాలో దాడి ..

పుల్వామా తరహాలో దాడి ..

గత నెల 14న పుల్వామాలోని అవంతిపోరలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అదే తరహాలో దాడి చేసేందుకు ముష్కర మూక జైషే మహ్మద్ వ్యుహరచన చేసిందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి. జమ్ము కశ్మీర్ లోనే ఆత్మహుతి దాడులు చేసేందుకు పథకం రచిస్తోందని .. అప్రమత్తంగా ఉండాలని పోలీసు, సీఆర్పీఎఫ్, తదితర భద్రతాసిబ్బందిని ఐబీ అప్రమత్తం చేసింది.

ఆరుగురికి శిక్షణ

ఆరుగురికి శిక్షణ

ఇప్పటికే ఆరుగురికి జైషే కమాండర్ శిక్షణ కూడా ఇచ్చారని ఐబీ వర్గాలు సమాచారం అందించాయి. ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలా దాడి చేసే అవకాశం ఉన్నందున .. అప్రమత్తంగా ఉండాలని స్పష్టంచేసింది. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని పేర్కొంది.

కశ్మీర్ యువతకు బాంబుల తయారీలో శిక్షణ

కశ్మీర్ యువతకు బాంబుల తయారీలో శిక్షణ

భారత్ పై ఎలాగైనా ప్రతీకార దాడి చేయాలని భావిస్తోన్న జైషే మహ్మద్ .. అవకాశం ఉన్న అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఉగ్రవాదులకు ఆత్మహుతి దాడికి సంబంధించి శిక్షణ ఇవ్వగా .. కశ్మీర్ లోయకు చెందిన యువతను బాంబులు వేసేందుకు ఎంపిక చేసింది. వారికి అందులో శిక్షణ ఇచ్చి .. భారత్ పై వదులుతోందని .. అప్రమత్తంగా ఉండాలని నిఘావర్గాలు అలర్ట్ చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+