జైశ్రీరామ్ నినాదాలు చేస్తారా ?, కళ్ల మూసి తెరిచేలోపు ?, సీసీటీవీ కెమెరాల్లో, పరార్ !
అయోధ్యలోని శ్రీరామ మందిరంలోని రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్బంగా సోమవారం దేశ విదేశాల్లో హిందువులు పండుగ చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీరాముడి ఆలయాలు, ఆంజనేయుడి ఆలయాలతో పాటు హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. దేశంలోని అన్ని నగరాల్లో, పట్టణాలు, గ్రామాల్లో జైశ్రీరామ్, జైవీరాంజనేయ అనే నినాదాలతో మార్మోగిపోయాయి.
దేశంలోని ప్రతి ప్రాంతంలో శ్రీరాముడి కౌటట్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి పాలాభిషేకం చేశారు. ఎక్కువగా ఉత్తర భారతదేశంలో, ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అయితే ఆయెధ్య రామ మందిరం ప్రారంభోత్సవం రోజున సంబరాలు చేసుకున్నారు. ప్రతి ప్రాంతంలో కాషాయ జెండాలు ఎగరవేశారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ బలంగా ఉన్న కర్ణాటకలో కూడా హిందువులు జోరుగా సంబరాలు చేసుకున్నారు.

ఆ సమయంలో ఓ వర్గం యువకులపై మరో వర్గం యువకులు రాళ్లతో దాడి చేశారు. అనంతరం హిందూ యువకులు కూడా మరో వర్గం మీద రాళ్లు రువ్వారు. పరస్పరం ఒకరి మీద ఒకరు రాళ్ల దాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతసేపు ఆ ప్రాంతంలో రాళ్ల వర్షం కురిసింది. స్థానికంగా నివాసం ఉంటున్న మహిళలు, పిల్లలు ఇళ్లలోకి పరుగులు తీసి తలుపులు వేసుకున్నారు.

సమాచారం తెలుసుకున్న వెంటనే అక్కడికి పరుగు తీసిన పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో వెంటనే అక్కడి నుంచి రెండు గ్రూపుల యువకులు పరారయ్యారు. మార్కెట్ ఠాణే పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి సీసీ కెమెరాలను పరిశీలించి రాళ్ల దాడికి పాల్పడిన వారి వివరాలు సేకరించారు. ముందుజాగ్రత్త చర్యగా ఘటనా స్థలంలో రెండు కేఎస్‌ఆర్‌పీ బెటాలియన్ స్క్వాడ్‌లను మోహరించారు.
బెళగావిలో నిత్యం కన్నడ, మరాఠి వర్గాల వారి మద్య గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు జైశ్రీరామ్ నినాదాలతో రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరడంతో బెళగావిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల నాయకులు, మత పెద్దలను పిలిపించిన పోలీసు అధికారులు శాంతి చర్చలు జరిపారని తెలిసింది. ఎవరైనా చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications