బీహార్ కోసం ఏపీని పక్కకు: అనుమానం, పవన్ సహా అందుకే అలా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో భారతీయ జనతా పార్టీ నేతల వ్యాఖ్యలు, విపక్షాలు ఆశించిన స్థాయిలో స్పందించకపోవడం... తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ జేడీ శీలం వ్యాఖ్యలు... తదితరాలు ప్రజల్లో అనుమానాలు రెకెత్తిస్తున్నాయని అంటున్నారు.
ప్రత్యేక హోదా పైన బీజేపీ ప్రస్తుతానికి వ్యూహాత్మకంగానే వెనుకడుగు వేస్తోందనే వాదనలకు జేడీ శీలం వ్యాఖ్యలు మరింత ఊతమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ దక్కవద్దనే బీజేపీ ప్రస్తుతానికి హోదా విషయంలో మౌనంగా ఉందనే వాదనలు ఇప్పటికే వినిపించాయి. తాజాగా జేడీ శీలం మాట్లాడుతూ.. బీహార్ ఎన్నికల కోసమే బీజేపీ ఏపీకి ప్రత్యేక హోదాను తాత్సారం చేస్తోందని అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాదిలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే బీజేపీ ప్రత్యేక హోదాపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. బీహార్ ఎప్పటి నుండో ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే... బీహార్ కూడా అడుగుతుంది.

ఇదే ఏడాది ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడే ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి బీహార్ ఎన్నికల్లో ఇబ్బందులు కొని తెచ్చుకోవడం ఎందుకని బీజేపీ భావిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి కేంద్రం నుండి పెద్ద మొత్తంలో నిధులు వస్తాయి.
ఇప్పటికిప్పుడు ఇస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోవడం, త్వరలో బీహార్ ఎన్నికల దృష్ట్యా బీజేపీ కొంత ఆలస్యం చేస్తుండవచ్చునని అభిప్రాయపడుతున్నారు.
బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. తాము ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తామని, కానీ ఎప్పుడు ఇచ్చేది అప్పుడే చెప్పలేమని చెబుతున్నారు. బీహార్, తదితర రాష్ట్రాలు, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే వారు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారని అంటున్నారు. ప్రత్యేక హోదా కష్టమని చెప్పారే కానీ ఇవ్వమని బీజేపీ నేతలు చెప్పకపోవడం గమనార్హం.
తెలిసే అలా మాట్లాడుతున్నారా?
తాము ఎట్టి పరిస్థితుల్లో హోదా తీసుకు వస్తామని గత కొద్ది రోజులుగా ఏపీ బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేపీ ప్రకటనలపై టీడీపీ అసహనం వ్యక్తం చేస్తున్నప్పటికీ.. ఆ పార్టీ నేతలు కూడా దాదాపు అలాగే మాట్లాడుతున్నారు. ముఖ్యస్థాయి నేతలకు 'ఎన్నికల వ్యూహం' అసలు విషయం తెలిసే.. కచ్చితంగా తెస్తామని అంతా గట్టిగా చెబుతున్నారా? అంటే చూస్తుంటే అలాగే కనిపిస్తోందని అంటున్నారు.
సమయం వచ్చినప్పుడు నిలదీస్తానని చెప్పిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్.. ప్రత్యేక హోదా పైన గతంలో ట్వీట్ చేశారు. ఏపీ రాజధాని విషయంలో వరుస ట్వీట్లు, చంద్రబాబును కలవడం, రాజధాని ప్రాంత రైతులను కలవడం చేశారు. ప్రెస్ మీట్ కూడా పెట్టారు.
కానీ ప్రత్యేక హోదా విషయంలో ఇప్పటి వరకు అంతగా స్పందించలేదు. నటుడు శివాజీ దీక్ష చేస్తూ.. పవన్ కళ్యాణ్ వంటి రావాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ బీజేపీ మఖ్య నేతల నుండి లేదా జనసేన నుండి ఎలాంటి స్పందన లేదు. అన్నీ తెలిసే మౌనం దాల్చుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, కొంత ఆలస్యమైనప్పటికీ ప్రత్యేక హోదా వస్తే అదే పదివేలు అని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు.
-
Tamil Nadu Election Survey: పవన్ ఫీట్ రిపీట్ చేస్తున్న విజయ్ ? తేల్చేసిన తాజా సర్వే..! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి












Click it and Unblock the Notifications