జయలలిత మృతి కేసులో ట్విస్ట్, అందుకే చెప్పలేదు, అపోలో!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి మిస్టరీ ఊహించని మలుపు తిరిగింది. ఆమెను ఊపిరాడని స్థితిలోనే ఆస్పత్రికి తీసుకువచ్చినట్టు శనివారం అపోలో ఆస్పత్రి యాజమాన్యం వెల్లడించింది. గతేడాది సెప్టెంబర్ 22న జయలలిత అస్వస్థతకు గురికావడంతో చెన్నైలోని అపొలో ఆస్పత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

సంచలన వ్యాఖ్యలు
2016 డిసెంబర్ 5వ తేదీ జయలలిత తుదిశ్వాస విడిచే వరకు 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలోనే చికిత్స చేశారు. జయలలిత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు.

వెంటనే కోలుకున్నారు
జయలలితను ఊపిరాడని స్థితిలోనే అపోలో ఆస్పత్రికి తీసుకుని వచ్చారని, వెంటనే తగిన చికిత్స అందించడంతో అమ్మ కోలుకున్నారని ప్రతాప్ సి. రెడ్డి వివరించారు. అయితే చివరికి దురదృష్టవశాత్తూ ఎవరూ ఊహించని ఫలితం వచ్చిందని ప్రతాప్ సి. రెడ్డి అన్నారు

ప్రపంచంలోనే!
ప్రపంచంలోని వైద్య నిపుణులు, ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యులను పిలిపించి జయలలితకు సాధ్యమైనంత వరకూ మంచి చికిత్స చేశామని, వైద్యులు చాలా శ్రమించారని ప్రతాప్ సి. రెడ్డి చెప్పారు. జయలలిత మృతిపై విచారణ జరుపుతున్న ఆర్ముగస్వామి ఏక సభ్య కమిషన్ అందరి అనుమానాలు నివృత్తి చేస్తుందని ప్రతాప్ సి. రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఊపిరాడని స్థితిలోనే
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ కమిషన్ నుంచి తమకు ఎటువంటి పిలుపు అందలేదని అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి శనివారం వెల్లడించారు. జయలలితను ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని ప్రతాప్. సి రెడ్డి చెప్పారు.

అందుకే అప్పుడు చెప్పలేదు
తమిళనాడు రాష్ట్రంలో శాంతిభద్రతలను దృష్టిలో పెట్టుకుని జయలలిత జ్వరంతో బాధపడుతున్నారనే ప్రకటనలు ఇచ్చామని ప్రతాప్ సి. రెడ్డి అన్నారు. ఆర్ముగస్వామి విచారణ కమిషన్ నుంచి పిలుపు వస్తే జయలలిత మరణంపై అన్ని వివరాలు ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని ప్రతాప్ సి. రెడ్డి వివరించారు.
-
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!!












Click it and Unblock the Notifications