రగిలిపోతున్న హరియాణ, గురుగ్రామ్ లో రెస్టారెంట్లు, షాపులకు నిప్పు, బయటకు వస్తే!

గురుగ్రామ్/హరియాణ: రెండు వర్గాల మధ్య గొడవలు మొదలు కావడంతో అమాయకులు బలి అయ్యారు. హరియాణలోని నూహ్ జిల్లాలో రెండు వర్గాల మధ్య గొడవలు జరగడంతో ఆ హింస గురుగ్రామ్ కు వ్యాపించింది. 18 గంటలకు పైగా హరియాణలో జరుగుతున్న హింస కారణంగా ఇప్పటి వరకు ఐదు మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.

నూహ్ లో మొదలైన గొడవలు ఇప్పుడు బాద్ షాపూర్ కు 70 కిలోమీటర్ల దూరంలోని గురుగ్రామ్ కు అల్లర్లు వ్యాపించాయి. సుమారు రెండు వందల మంది అల్లరి మూకులు మంగళవారం సాయంత్రం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో గురుగ్రామ్ లోకి కర్రలు, ఆయుధాలతో ఎంట్రీ ఇవ్వడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి.

As riots spread to Gurugram by both groups, shops and restaurants were destroyed

గురుగ్రామ్ లోని పలు మటన్ షాపులు, రెస్టారెంట్ లు, హోటల్స్ మీద అల్లరిమూకలు రాళ్లు రువ్వి కర్రలతో దాడులు చేసి చివరికి నిప్పంటించారు. గురుగ్రామ్ లో జరిగుతున్న అల్లర్ల కారణంగా పలువురికి గాయాలైనాయి. ఢిల్లీకి కేవలం 50 కిలోమీటర్ల దూరంలోని నూహ్ లో ఓ వర్గం వాళ్లు ఊరేగింపు చేస్తున్న సమయంలో మరో వర్గం వాళ్లు రాళ్లు రువ్విదాడులు చెయ్యడంతో ఇరు వర్గాల మధ్య గొడవలు మొదలైనాయి.

సుమారు 2, 500 మంది ఒక్కసారిగా దాడులు చెయ్యడంతో పలువులు దేవాలయాల్లో దాక్కోవడానికి ప్రయత్నించారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారని స్థానిక మీడియా చెప్పింది. ప్రతీకారంగా సోమవారం అర్దరాత్రి మరో వర్గం వాళ్లు మసీదుకు నిప్పు పెట్టడంతో పరిస్థితులు చెయ్యిదాటిపోయాయి.

హరియాణలో జరిగిన అల్లర్ల కారణంగా ఇప్పటి వరకు 44 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. హరియాణ అల్లర్లలో హింస చెలరేగడానికి కారణం అయిన 70 మందిని అరెస్టు చేశామని, మరికొంత మంది కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో నాసిర్, జునైద్ అనే పశువుల వ్యాపారులు హత్యకు గురైనారు.

ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భజరంగ్ దళ్ నాయకుడు మోను మనేసర్ ర్యాలీకి హాజరు అవుతాడని ఓ వీడియో విడుదల కావడంతో హరియాణలో అల్లర్లు మొదలైనాయి. హరియాణలో పరిస్థితి అదుపులోకి తీసుకురావానికి స్థానిక పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అవసరం అయితే ఆర్మీ బలగాలను రంగంలోకి దింపాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+