PPF: పీపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. మార్చి 31లోపు ఆ పని చేయండి..!

చాలా మంది వివిధ పొదుపు పథకాల్లో పొందుపు చేస్తుంటారు. అయితే ఇందులో ఎక్కువగా మంది సురక్షితమైన, కచ్చితమైన రాబడి వచ్చే పథకాల్లో పెట్టుబడి పెడతారు. అలాంటి ప్రభుత్వ పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ఒకటి. పీపీఎఫ్ సురక్షితమైన, కచ్చితమైన రాబడి ఇచ్చే పొదుపు పథకం. ఈ దీర్ఘకాలి పెట్టుబడి పథకంలో పెట్టుబడి పెట్టి కచ్చితమైన రాబడి పొందవచ్చు. ఈ పథకం పెద్దలకే కాకుండా పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది.

పీపీఎఫ్ మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. ఆ తర్వాత 5 ఏళ్ల చొప్పున మరో 10 సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చు. ఈ పథకంలో పెద్దలు, పిల్లలు చేరవచ్చు. పిల్లలు అయితే సంరక్షుడితో కలిసి ఖాతా తెరవాలి. పీపీఎఫ్ ఖాతా పోస్టాఫీస్, బ్యాంకుల్లో ఓపెన్ చేయవచ్చు. నెట్ బ్యాంకింగ్ లో కూడా పీపీఎఫ్ ఖాతా ఓపెన్ చేయవచ్చు. పీపీఎఫ్ లో సంవత్సరానికి కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

At least Rs 500 should be deposited in the PPF account in a financial year

గరిష్ఠంగా రూ.1,50,000 వరకు పెట్టుబడి పెట్టొచ్చు. ఈ రూ. లక్ష 50 వేలు సెక్షన్ 80 సీ కింద పన్ను మనహాయింపు కూడా ఉంటుంది. ప్రస్తుతం పీపీఎఫ్ లో 7.1 శాతం వడ్డీ అందిస్తున్నారు. పీపీఎఫ్ లో నెలనెలా పెట్టుబడి పెట్టొచ్చు లేదా రెండు లేదా మూడు ఇలా ఎప్పుడైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఒకేసారి కూడా పెట్టుబడి పెట్టొచ్చు. ఉదాహరణకు మీరు నెలకు రూ.12,500 చెల్లిస్తే సంవత్సరానికి రూ.1,50,000 కడతారు.

15 సంవత్సరాల్లో 22,50,000 చెల్లిస్తారు. మీకు వడ్డీ రూ. 18,18,209 కలుపుకుని మొత్తం 40,68,209 వస్తాయి. మీరు మెచ్యూరిటీ పిరియడ్ 5 సంవత్సరాల చొప్పున 10 ఏళ్లు పొడిగించుకోవచ్చు. దీంతో మీరు భారీ మొత్తాన్ని పొందవచ్చు. 15 సంవత్సరాల తర్వాత మీకు రూ.40 లక్షలు కావాలంటే రోజుకు రూ.416 పొదుపు చేస్తే చాలు. పీపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత ఒక ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి.

లేకుంటే పీపీఎఫ్ ఖాతా ఇన్ యాక్టివ్ అవతుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మీరు ఒక్క రూపాయి కూడా పీపీఎఫ్ లో పొదపు చేయకుంటే.. వెంటనే చేయండి. ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31లోపు మీరు పీపీఎఫ్ లో ఖాతాల కనీసం రూ.500 జమ చేయకపోతే మీ ఖాతా ఇన్ యాక్టివ్ అవుతుంది జాగ్రత్త.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+