బతిమాలినా ఆగలేదు: కన్నీటిపర్యంతమైన ఎటిఎం విక్టిం
బెంగళూరు: తాను వేడుకున్నప్పటికీ దాడి చేశాడని ఎటిఎం బాధితురాలు ఎటిఎం బాధితారులు జ్యోతి ఉదయ్ అన్నారు. గత నెల 19వ తేదీన బెంగళూరులోని ఎటిఎంలో దుండగుడి దాడిలో తీవ్రంగా గాయపడిన జ్యోతి శనివారం ఆసుపత్రి నుండి విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఎప్పటిలాగే తాను దాడి జరిగిన రోజు కూడా సంతోషంగానే ఇంటి నుండి బయలుదేరానని, కుమార్తె బడిలో ఫీజు కట్టేందుకు డబ్బు అవసరమై ఎటిఎంలోకి వెళ్లానని, అంతలోనే ఓ దుండగుడు తన వెనుకే వచ్చి షట్టర్ మూశాడని, డబ్బు ఇవ్వాలని మాట్లాడుతూనే వేట కత్తి తీశాడని చెప్పారు.

దాడి చేయవద్దని తాను వేడుకున్నప్పటికీ అతను వినలేదని తెలిపారు. దాడి తర్వాత షట్టరును కిందకి దించి నిందితుడు వెళ్లిపోయాడని, దాడి గురించి కార్యాలయ సిబ్బందికి ఫోన్ చేసి చెప్పేందుకు విఫలయత్నం చేశానని తెలిపారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయాలన్నారు.
ఎవరో షట్టరు తీయడం, ఆటోలో ఆసుపత్రికి తీసుకు వెళ్లడం తెలుస్తూనే ఉన్నప్పటికీ షాక్‌తోనే ఏమీ మాట్లాడలేకపోయానని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. దేవుడే ఆటో డ్రైవర్ల రూపంలో వచ్చి ఆసుపత్రికి తీసుకువచ్చి ప్రాణాలను నిలిపారని పేర్కొన్నారు. కాగా, రెండు మూడు నెలల తర్వాత జ్యోతి ఉధయ్ యథావిథిగా వధులకు హాజరు కావొచ్చునని ఆసుపత్రి వర్గాలు చెప్పాయి.












Click it and Unblock the Notifications