ఆ ఏటిఎంలో 100 కోడితే 500.. 5వేలు వచ్చాయి!
జైపూర్: ఆ ఏటిఎంలో అంతా విచిత్రమే. రూ. 100 కొడితే 500 వస్తాయి. రూ. 500 కొడితే 5వేల నగదు వస్తుంది. ఇంకేముందు ఆ ఏటిఎం ముందు జనం బారులు తీరారు. ఆ ఏటిఎంలో ఐదు రేట్లు ఎక్కువగా నగదు తీసుకుని సంబరపడిపోయారు. ఆ ఏటిఎం రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది.
వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని సికార్ జిల్లాలోని అజిత్‌గఢ్ ప్రాంతంలో ఓ యాక్సిస్ బ్యాంకు ఏటీఎం నుంచి కావాల్సిన దానికన్నా ఐదు రెట్లు ఎక్కువ డబ్బులు వచ్చాయి. ఈ విషయం క్షణాల్లో బయటకురావడంతో స్థానికులంతా ఆ ఏటీఎం ముందు బారులు తీరారు.

దీంతో సమాచారమందుకున్న పోలీసులు హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకుని ప్రజలను అడ్డుకున్నారు. బ్యాంకు యాజమాన్యానికి సమాచారమందించారు. ఏటీఎం వద్ద సెక్యూరిటీ గార్డు లేకపోవడంతో అప్పటికే అనేక మంది డబ్బులు డ్రా చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం ఏటీఎంకు తాళం వేసి కానిస్టేబుల్‌ను నియమించారు. ఏటీఎంలో తలెత్తిన సాంకేతిక లోపం వల్లే ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు వచ్చాయని.. ఏటీఎంను సరిచేస్తున్నట్లు బ్యాంకు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications