కాశ్మీర్‌పై వ్యాఖ్య: కేజ్రీవాల్ పార్టీ ఆఫీసుపై రాళ్ల దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో పుట్టుకు వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కార్యాలయం పైన బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్, సిఎం కేజ్రీవాల్‌లకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. కాశ్మీర్ ప్రాంతం భారత్‌లో అంతర్భాగమని గళమెత్తారు. ఈ దాడిలో ముప్పై నుండి నలభై మంది వరకు పాల్గొన్నారు.
శ్రీరామ్ సేన దాడికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. కొంతమంది కౌషింబి పార్టీ కార్యాలయంలోకి చొచ్చుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేశారని, గేటు మూసి వేసి ఉండటంతో బయట నుండి రాళ్లతో దాడి చేశారని పార్టీ నేత దిలీప్ పాండే చెప్పారు. కాగా, కాశ్మీర్ ఘటనపై ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ప్రశాంత్ భూషణ్ ఓ టీవీ ఛానల్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కాశ్మీర్ లోయలో రెఫరెండం నిర్వహించాలని, వారి భద్రత గురించి ప్రజలే నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇవ్వాలని అన్నారు.
అయితే భూషణ్ వ్యాఖ్యలతో అరవింద్ కేజ్రీవాల్ సోమవారం విభేదించారు. అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అన్నారు. భూషణ్ వ్యాఖ్యలపై ఎఎపి నేత కుమార్ విశ్వాస్ విలేకరులతో మాట్లాడుతూ.. ఎఎఫి ఏకీకృత భారత్‌ను కోరుకుంటుందని చెప్పారు. ఇది చర్చించాల్సిన అంశం కాదన్నారు. కాశ్మీర్ భారత్‌లోని భాగమేనని చెప్పారు.












Click it and Unblock the Notifications