కాంగ్రెస్ అధిష్టానం భేటీ: అయోధ్య తీర్పు ప్రధాన అజెండా: పార్టీ వైఖరిపై నిర్ణయం..!
అయోధ్య పైన తీర్పు వెల్లడి కానున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అత్యున్నత విభాగంగా ఉన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావాలని నిర్ణయించింది. తొలుత ఈ సమావేశం ఆదివారం నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, రాత్రి సుప్రీం కోర్టు శనివారమే అయోధ్య పైన తీర్పు ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్ జారీ చేయటంతో కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశాల మేరకు ఈ ఉదయం 9:45 గంటలకు 10 జనపథ్‌లో ఈ సమావేశం జరగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇందులో కాంగ్రెస్ కీలక నేతలు సహా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉన్నారు. తీర్పుపై కాంగ్రెస్ వైఖరి నిర్ణయించుకునేందుకే ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం.
తీర్పు పైనే సమీక్ష..
ఇప్పటికే దేశ దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు కారణమైన జటిల సమస్యకు నేడు పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంపై యాజమాన్య హక్కులు ఎవరికి లభిస్తాయో నేడు తేలనుంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై నేడు తుది తీర్పు వెలువడనుంది. తీర్పు వెలువడే సమయంలో పార్టీ కీలక నేతలు అందుబాటులో ఉండాలని సోనియా సూచించారు. తీర్పు పైన ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. ఆ తరువాత తీర్పు పైన వివిధ వర్గాల నుండి వచ్చే స్పందనలు..అధికారంలో ఉన్న బీజేపీ రియాక్షన్ చూసిన తరువాతనే తమ అభిప్రాయం వెల్లడించాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధినాయకత్వం ఉంది. దీంతో..ఎవరూ తీర్పు పైన హైకమాండ్ సూచనలు వచ్చే వరకూ స్పందించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి తీర్పు తరువాత రాజకీయంగా బీజేపీ ఇతర పార్టీలు ఏ రకంగా స్పందిస్తాయనేది ఆసక్తి కరంగా మారింది .తీర్పు ఎలా ఉన్నా..ముందు అన్ని వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని ఇప్పటికే ప్రధాని మోదీ అప్పీల్ చేసారు.

ముందు సంయమనం..తరువాతే రాజకీయం..
కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం తీర్పు సమీక్షకు ప్రాధాన్యత ఇస్తే ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. సోనియా నివాసంలో జరిగే ఈ సమావేశంలో తీర్పు వెలువడిన వెంటనే పార్టీ స్పందించే అవకాశాలు లేవు. ముందుగా పార్టీ పరంగా ఎవరూ తీర్పు పైన స్పందించవద్దని స్పష్టం చేసింది. తీర్పు ఎలా ఉన్నా ఎక్కడా ఎవరూ సంయమనం కోల్పోకుండా ఉండాల్సిన అవసరం ఉందని అన్ని పార్టీలు..అన్ని వర్గాల నేతలు కోరుతున్నారు. రాజకీయాల కంటే ముందు సంయమం అవసరమని..ఆ తరువాత రాజకీయల గురించి ప్రస్తావన చేయవచ్చనే సూచనలు వస్తున్నాయి. దీంతో..ప్రభుత్వంతో పాటుగా ప్రధాన ప్రతిపక్షం సైతం ఆచితూచి వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. సున్నిత అంశం పైన కీలక తీర్పు కావటంతో.. కాంగ్రెస్ పార్టీ లోతుగా ఈ తీర్పు మీద సమీక్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రాలకు అవసరమైన మార్గదర్శకాలు జారీ చేసారు.












Click it and Unblock the Notifications