ప్రధాని మోడీ దేవుడు.. బాబా రాందేవ్ షాకింగ్ కామెంట్స్ !
ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు జరిగాయి. పలు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించగా.. బహుళ సేవా కార్యక్రమాలు కూడా చేపట్టబడ్డాయి. ఈ సందర్భంలో యోగా గురువు, పతంజలి సహ వ్యవస్థాపకులు బాబా రాందేవ్ మోడీపై ప్రశంసలు కురిపించారు.
రాందేవ్ ప్రశంసలు..
రాందేవ్ మాట్లాడుతూ.. మోడీ ఒక దైవ స్వరూపుడు, ఇలాంటి నాయకులు శతాబ్దానికి ఒకరే పుడతారు. ఆయనను దేవుడితో, ఋషితో, పర్వత సమానమైన గొప్ప వ్యక్తిత్వంతో పోల్చవచ్చు. దేశం కోసం ఆయన చూపుతున్న తపన, కృషి అపారమైనవి" అని తెలిపారు. సనాతన ధర్మానికి, స్వదేశీ ఉద్యమానికి మోదీ నిజమైన ప్రవక్త అని కొనియాడారు.

సేవా కార్యక్రమాలు
ప్రధాని పుట్టినరోజు సందర్భంగా పతంజలి దేశవ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు ప్రారంభించింది.
-
దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులను సత్కరించనున్నట్లు ప్రకటించారు.
-
సీబీఎస్ఈ, రాష్ట్ర బోర్డులు, భారతీయ శిక్షా బోర్డు పరిధిలో 10వ, 12వ తరగతుల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు రూ. 50,000 చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.
-
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 750 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు రాందేవ్ తెలిపారు.
దేశ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనాన్ని అందించేందుకు మోడీ.. తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ, "యోగాను ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు అని కొనియాడారు. ఆయన వల్లే యునైటెడ్ నేషన్స్ యోగా దినోత్సవాన్ని గుర్తించింది. అలాగే స్వదేశీ ఉత్పత్తుల ప్రాధాన్యతను ప్రపంచం ముందుకు తెచ్చారని రాందేవ్ పేర్కొన్నారు.
మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా వీడియోలో మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. భారతదేశం కోసం చాలా సాధించారంటూ కొనియాడారు. భారతదేశం-ఇజ్రాయెల్ మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయన్నారు.
అలాగే ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా మోడీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. రెండు దేశాల మధ్య మంచి భాగస్వామ్యం ఉందని ప్రశంసించారు. అలాగే మోడీ మంచి స్నేహితుడు అంటూ తెలిపారు. న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ కూడా మోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే యూకే మాజీ ప్రధాని రిషి సునక్ కూడా విషెస్ చెప్పారు. బ్రిటన్‌కు మోడీ మంచి స్నేహితుడు అని కొనియాడారు.












Click it and Unblock the Notifications