మోడీ ప్రభుత్వాన్ని కూల్చేకుట్ర-దేశంలో అశాంతికి యత్నం-ఎల్గార్ పరిషత్ కేసులో కోర్టు కామెంట్స్
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన ఎల్గార్ పరిషద్ కేసులో ముగ్గురు నిందితులకు ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు బెయిల్ నిరాకరించింది. ఈ కేసులో తీవ్రత దృష్ట్యా నిందితులకు బెయిల్ ఇవ్వొద్దంటూ ఎన్ఐఏ చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్దానం ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు ఈ కేసులో తీవ్రతను గుర్తుచేసేలా తీవ్ర వ్యాఖ్యలు కూడా చేసింది.
Recommended Video
ఎల్గార్ పరిషత్-మావోయిస్ట్ సంబంధాల కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు వ్యక్తులకు బెయిల్ నిరాకరించిన ప్రత్యేక న్యాయస్థానం, ఈ ముగ్గురూ నిషేధిత సంస్థ అయిన సీపీఐ (మావోయిస్ట్)లోని ఇతర సభ్యులతో కలిసి "తీవ్రమైన" చర్యకు పాల్పడ్డారని రికార్డులో ఉన్న అంశాలు సూచిస్తున్నాయని పేర్కొంది. దేశంలో అశాంతి సృష్టించి మోదీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర పన్నారని వ్యాఖ్యానించింది. సీపీఐ (మావోయిస్ట్) మోడీ ప్రభుత్వాన్ని అంతం చేయడానికి వంక పెట్టిందని, ప్రధానమంత్రి నరేంద్రమోడీ రోడ్ షోలను లక్ష్యంగా చేసుకుని మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య వంటి మరో ఘటనకు ప్లాన్ చేసినట్లు రికార్డుల ప్రకారం ప్రాధమికంగా నిర్ధారణ అయినట్లు కోర్టు వ్యాఖ్యానించింది.

కబీర్ కళా మంచ్ సభ్యులైన ముగ్గురు నిందితులు సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్, జ్యోతి జగ్తాప్‌లకు బెయిల్ నిరాకరించిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు న్యాయమూర్తి కోతలికర్ ఫిబ్రవరి 14న ఇచ్చిన వివరణాత్మక ఆదేశాలు ఫిబ్రవరి 17న వెలుగులోకి వచ్చాయి. రికార్డులో ఉంచిన లేఖలు, పత్రాల నుంచి, దరఖాస్తుదారులు నిషేధిత సంస్థలోని ఇతర సభ్యులతో కలిసి మొత్తం దేశంలో అశాంతిని సృష్టించడానికి, రాజకీయంగా ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు తీవ్రమైన కుట్ర పన్నారని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు కోర్టు పేర్కొంది. నిందితులు నిషేధిత సంస్థ సీపీఐ (మావోయిస్ట్)లో సభ్యులు మాత్రమే కాకుండా ఆ సంస్థ స్ఫూర్తితో కార్యకలాపాలు సాగిస్తున్నారని, ఇది దేశ ప్రజాస్వామ్యాన్ని కూలదోయడం తప్ప మరొకటి కాదని ప్రాథమికంగా నమోదు చేసిన అంశాలు సూచిస్తున్నాయని న్యాయమూర్తి పేర్కొన్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications