ఎవడి భార్య పతివ్రత కాదులే, అందరూ ఆ పార్టీకే ఓటు వేస్తారు, వాట్సాప్ స్టేటస్ లో ?

బెంగళూరు/చిక్కమగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అందరూ ఓటు వేశాలా ఎన్నికల అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. ఇక బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి నానాతిప్పలు పడ్డారు. అయితే ఓ వ్యక్తి ఎవడి భార్య పతివ్రత కాదు, అందరూ అందరే, బీజేపీకి ఓటు వేస్తే సరిపోతుంది అని మొబైల్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టడం కలకలం రేపింది.

కర్ణాటకలో మేము అధికారంలోకి వస్తే బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టం చేసింది. బజరంగ్ దళ్ ను నిషేధిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీతో సహ బీజేపీకి చెందిన పెద్దలు తీవ్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడ్డారు.

bajrangdalactivist

బజరంగ్ దళ్ కు, ఉగ్రవాదులతో లింక్ పెట్టుకున్న పీఎఫ్ఐ సంస్థకు ఏమిటి పోలిక అంటూ బీజేపీ నాయకులు మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చాలా రోజులు పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి బహిరంగసభలో జై బజరంగబలి అంటూ నినాదాలు చేసి బజరంగ్ దళ్ ను బ్యాన్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో సరైన బుద్ది చెప్పాని కన్నడిగులకు మనవి చేశారు.

కర్ణాటకలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ-బజరంగ్ దళ్ కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఎదురైయ్యింది. బుధవారం కర్ణాటకలోని 224 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని తరికెరె తాలుకాలోని రంగేనహళ్లి గ్రామంలో నివాసం ఉంటున్న కార్తీక్ అనే బజరంగ్ దళ్ కార్యకర్త చేసిన పనికి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఎదురైనాయి

బుధవారం ఓటు వేసిన తరువాత బజరంగ్ దళ్ కార్యకర్త కార్తీక్ ఎవడి భార్య ఏమి పెద్ద పతివ్రత కాదు. అందరూ బీజేపీకి ఓటు వెయ్యండి అంటూ అతని మొబైల్ వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు. రాత్రి కార్తీక్ వాట్సాప్ స్టేటస్ గురించి తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లీం సంఘాల నాయకులు మండిపడ్డారు.

evm

బుధవారం రాత్రి లక్కవళ్లి పోలీస్ స్టేసన్ ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లీం మత పెద్దలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి బజరంగ్ దళ్ నాయకుడు కార్తీక్ ను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బజరంగ్ దళ్ కార్యకర్త కార్తీక్ ను పట్టుకుని అతన్ని చితకబాదేశారు.

ఒక పార్టీకి కాని, ఓ వ్యక్తికి కాని ఓటు వెయ్యాలని ఎవరికైనా మనవి చెయ్యాలన్నా, సూచించాలన్నా అనేకదారులు ఉన్నాయని, అలాంటిది ఓ వక్తి అందరి భార్యల గురించి తప్పుడుగా మాట్లాడి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వెయ్యలాని చెప్పడానికి ప్రయత్నించిన కార్తీక్ ను పట్టుకున్న స్థానికులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అతని గూబ పగిలిపోయేలా చితకబాదేశారు. బజరంగ్ దళ్ కార్యకర్త కార్తీక్ మీద చిక్కమగళూరు జిల్లాలో కేసు నమోదు అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+