12 కాదు 5 పీఎం : 1000 బస్సులు పంపడంపై ప్రియాంక గాంధీ యూపీ సర్కార్‌కు ప్రతీ లేఖ
లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని సొంత రాష్ట్రం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ముందుకొచ్చారు. వెయ్యి బస్సులు పంపిస్తానని.. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాయగా.. అంగీకరించిన సంగతి తెలిసిందే.
దీంతో మధ్యాహ్నం 12 గంటలకు నోయిడాకు 500, ఘజియాబాద్‌కు 500 బస్సులను పంపించాలని యూపీ హోంశాఖ కార్యదర్శి ప్రియాంకగాంధీకి లేఖ రాశారు. దీనిపై ప్రియాంక కార్యదర్శి ప్రతీగ మరో లేఖ కూడా రాశారు. మీరు చెప్పిన చోటుకు బస్సులను పంపిస్తామని.. కానీ 12 గంటలకు వీలుకాదని.. సాయంత్రం 5 గంటలకు పంపిస్తామని పేర్కొన్నారు.

కచ్చితంగా 5 గంటలకు బస్సులు చేరుకుంటాయని.. ప్రయాణికుల జాబితా సిద్ధంగా ఉండాలని ప్రియాంక గాంధీ కోరారు. తమ బస్సు సిబ్బంది సమన్వయం చేసుకొని.. వలసకూలీలను తరలించే ఏర్పాట్లు చేయాలని కోరారు. యూపీ ప్రభుత్వం మాత్రం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకోవాలని.. కోరగా ప్రియాంకగాంధీ మాత్రం మరింత సమయం కోరారు.
వలస కార్మికులను తరలించేందుకు వెయ్యి బస్సులు పంపిస్తానని ప్రియాంక గాంధీ కోరగా.. సోమవారం యోగి అంగీకరించిన సంగతి తెలిసిందే. తొలుత లక్నోకు బస్సులను పంపాలని ప్రభుత్వం కోరగా.. అక్కడ కంటే ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో కూలీలు ఎక్కువగా ఉన్నారు. అక్కడికి పంపిస్తే మేలు అని ప్రియాంక అభిప్రాయపడ్డారు. కానీ చివరికి ప్రభుత్వం మాత్రం నోయిడా, ఘజియాబాద్‌కు బస్సులను పంపించాలని తెలుపడంతో.. నిర్దేషిత సమయం కన్నా ఆలస్యంగా బస్సులను పంపిస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications