బెంగళూరులో క్యాబ్ డ్రైవర్ ఘాతుకం..!!
బెంగళూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. లైవ- ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న 35 ఏళ్ల మహిళను ఆమె ఓ క్యాబ్ డ్రైవర్ దారుణంగా హత్య చేశాడు. పెట్రోల్‌తో నిప్పంటించి హత్యకు పాల్పడ్డాడు. మరో వ్యక్తితో ఆమె పరిచయం పెంచుకోవడం వల్ల తరచూ ఇద్దరి మధ్య గొడవలు చోటు చేసుకుంటోండటమే ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో బ్ డ్రైవర్ విఠల్ ను అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు.
హతురాలి పేరు వనజాక్షి. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని హుళిమావు పోలీస్ స్టేషన్ పరిధిలో గల హొమ్మదేవనహళ్లిలో నివసిస్తోంది. భర్త చనిపోవడంతో ఆమె ఒంటరిగా నివస్తోంది. ఈ క్రమంలో ఆమెకు విఠల్ తో పరిచయం ఏర్పడింది. ఆమె స్వగ్రామానికి చెందిన వాడే కావడంతో ఆ పరిచయం కాస్త సహజీవనానికి దారి తీసింది. విఠల్ భార్య చనిపోవడంతో వనజాక్షికి దగ్గర అయ్యాడు. నాలుగేళ్లుగా ఇద్దరూ హొమ్మ దేవనహళ్లిలో సహజీవనం చేస్తుండే వారు.

కాగా ఈ మధ్యకాలంలో వారి మధ్య విభేదాలు తలెత్తాయి. విఠల్ మద్యానికి బానిస కావడం, ఇతర దురలవాట్లు తోడు కావడంతో వనజాక్షి అతన్ని దూరం పెట్టింది. మరియప్ప అనే వ్యక్తికి ఆమె తరచూ ఫోన్ చేస్తోండటాన్ని గమనించాడు విఠల్. అతనితో సన్నిహితంగా మెలగడం మొదలుపెట్టినట్లు అనుమానించాడు. ఈ విషయమై కొద్ది రోజులుగా ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరిగేవి.
ఈ నెల 30వ తేదీన వనజాక్షి తన స్నేహితుడు మరియప్పతో కలిసి బన్నేరుఘట్ట నుంచి బసవనపురకు శాంత్రో కారులో వెళ్తుండటాన్ని విఠల్ గమనించాడు. వారిని వెంబడించాడు. హోమ్మదేవనహళ్లి వద్ద కారును అడ్డగించాడు. ఆ వెంటనే వెంట తెచ్చుకున్న అయిదు లీటర్ల పెట్రోల్‌ను వనజాక్షిపై పోసి లైటర్‌తో నిప్పంటించి పారిపోయాడు. ఈ ఘాతుకాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరియప్పకూ స్వల్పంగా గాయాలయ్యాయి.
సమాచారం అందిన వెంటనే హుళిమావు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. వనజాక్షిని చికిత్స కోసం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. 60 శాతం కాలిన గాయాలైనట్లు డాక్టర్లు వెల్లడించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న హుళిమావు పోలీసులు విఠల్ ను అరెస్ట్ చేశారు. అతన్ని రిమాండ్ కు తరలించినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (ఎలక్ట్రానిక్ సిటీ డివిజన్) ఎం నారాయణ వెల్లడించారు.












Click it and Unblock the Notifications