రెడ్డి మీద మొదటి వేటు వేసిన సిద్దరామయ్య, ఐటీ హబ్ కు కొత్త బాస్, మార్క్ రాజకీయాలు !
బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో సీఎం సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో హోమ్ శాఖలో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ సీహెచ్. ప్రతాప్ రెడ్డి మీద బదిలి వేటు వేసిన సిద్దరామయ్య ప్రభుత్వం అనేక మంది ఐపీఎస్ అధికారులకు బదిలి చేసింది.
బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా ప్రతాప్ రెడ్డి 2022 మే 17వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రతాప్ రెడ్డి ఇంకా కొంతకాలం పాటు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు నిర్వహించాల్సి ఉంది. అయితే బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతాప్ రెడ్డి బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించారు.

కర్ణాటక డీజీపీ ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్ గా బదిలి కావడం, అదే సమయంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఐపీఎస్ అధికారులకు స్థానచలనం మొదలైయ్యింది. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డిని సెక్యూరిటీ విభాగం డీజీపీగా నియమించారు. బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా సీనియర్ ఐపీఎస్ అధికారి బి. దయానంద్ ను నియమిస్తూ మంగళవారం సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
బెంగళూరు ట్రాఫిక్ విభాగం అడిషనల్ పోలీసు కమీషనర్ గా పని చేస్తున్న ఎంఏ. సలీమ్ ను సీఐడీ డీజీగా నియమిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో సీనియర్ పోలీసు అధికారి శరత్ చంద్రాను కర్ణాటక ఇంటలిజెన్స్ విభాగం డీజీపీగా నియమిస్తూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంవత్సరాం పాటు బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ గా పని చేసిన ప్రతాప్ రెడ్డి పోలీసుల శాఖలో మంచి పేరు తెచ్చుకున్నారు. అంతకు ముందు ప్రతాప్ రెడ్డి ఇంటలిజెన్స్ విభాగం ఏడీజీపీగా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు ఐపీఎస్ అధికారులను బదిలి చేసింది.
ఇప్పుడు అదే బాటలో బెంగళూరు సిటీ పోలీసు కమీషనర్ ప్రతాప్ రెడ్డితో పాటు అనేక మంది ఐపీఎస్ అధికారులను సిద్దరామయ్య ప్రభుత్వం బదిలి చేసి వాళ్ల మార్క్ రాజకీయాలకు తెరలేపారు. మొత్తం మీద సిద్దరామయ్య ప్రభుత్వం అనేక జిల్లాల్లోని ఎస్పీలను, ఐఏఎస్ అధికారులను బదిలి చెయ్యాలని డిసైడ్ అయ్యిందని తెలిసింది.












Click it and Unblock the Notifications