మిస్టర్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీటర్ అరెస్టు, ఎలాంటి కేసులు అని తెలుసుకుంటే షాక్ !
బెంగళూరు/విజయవాడ: ప్రతిరోజు జిమ్ చేస్తున్న యువకుడు బాడీ బిల్డర్ కావాలని ఆశపడ్డాడు. సొంత రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల్లో బాడీ బిల్డర్ పోటీలు జరిగితే ఆ యువకుడు హాజరౌతున్నాడు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని మూడో స్థానంలో నిలిచి అవార్డుతో పాటు రివార్డు సొంతం చేసుకున్న యువకుడు కొన్ని కేసుల్లో అరెస్టు అయ్యాడు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన సయ్యద్ బాషా అలియాస్ సయ్యద్ అనే యువకుడు చిన్నప్పటి నుంచి వ్యాయామం చేస్తూ బాడీ బిల్డర్ కావాలని ఆశపడ్డాడు. కండలు పెంచిన సయ్యద్ బాషా బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో జరిగిన బాడీ బిల్డర్ రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు.

మిస్టర్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్స్ లో పాల్గొన్న సయ్యద్ బాషా అందరితో పోటీపడి మూడో స్థానంలో నిలిచి నగదు బహుమతితో పాటు అవార్డు సొంతం చేసుకున్నాడు. మిస్టర్ ఆంధ్రప్రదేశ్ కాపిటీషన్స్ లో థర్డ్ ప్లేస్ లో నిలిచి అందరిలో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ బాషా సమాజంలో గౌరవం పెంచుకోవడానికి ప్రయత్నించకుండా అడ్డదారిలో నడిచాడు.
బెంగళూరు నగరంలో చైన్ స్నాచింగ్ లు చేస్తున్న సయ్యద్ బాషా అక్కడి గిరినగర పోలీసులకు అడ్డంగా చిక్కిపోయాడు. చూడటానికి సినిమా హీరోలా కండలు పెంచిన సయ్యద్ బాషా మహిళల మెడలో బంగారు గొలుసులు లాక్కొని వెలుతున్న సమయంలో అతన్ని, అతని స్నేహితుడు షేక్ అయూబ్ ను గిరినగర పోలీసులు అరెస్టు చేశారు.

విచారణలో సయ్యద్ బాషా మిస్టర్ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్స్ లో మూడో బహుమతి సంపాధించాడని తెలుసుకున్న బెంగళూరు పోలీసులు షాక్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో బాడీ బిల్డర్ సయ్యద్ బాషా మీద 32 కేసులు నమోదు అయ్యాయని. ఇప్పటికే జైలుకు వెళ్లిన సయ్యద్ బాషా తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.
విలాసవంతమైన జీవితం గడపడానికి సయ్యద్ బాషా అతని స్నేహితుడితో కలిసి బెంగళూరు చేరుకుని చైన్ స్నాచింగ్ లు చేస్తున్నాడని బెంగళూరు పోలీసులు తెలిపారు. మొత్తం మీద చైన్ స్నాచింగ్ కేసుల్లో మిస్టర్ ఆంధ్రప్రదేశ్వ కాంపిటీటర్ చిక్కిపోవడం బెంగళూరులో హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications