గాలి జనార్దన్ రెడ్డికి షాక్, పాత మైనింగ్ కేసు, క్రిమినల్ కేసు పెట్టండి, కోర్టు ఆర్డర్ !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్, సొంత పార్టీ సింబల్ మీద అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాలి జనార్దన్ రెడ్డికి కష్టాలు ఎదురైనాయి. చాలా సంవత్సరాల క్రితం నాటి ఓ కేసులో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డితో సహ తదితరుల మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని బెంగళూరులోని ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మైనింగ్ కింగ్ అని పేరు తెచ్చుకున్న గాలి జనార్దన్ రెడ్డి, ఆయన సమీప బంధువు బీవీ. శ్రీనివాసరెడ్డి తదితరుల మీద అక్రమ మైనింగ్ కేసు నమోదు అయ్యింది. ఇదే కేసులో గాలి జనార్దన్ రెడ్డి, బీవీ. శ్రీనివాస్ రెడ్డి తదితరులను 2011లో అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. తరువాత గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో బెయిల్ తీసుకున్నారు.

ఈ కేసు ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. ఇదే కేసుకు సంబంధించి బెంగళూరులోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గాలి జనార్దన్ రెడ్డి తదితరుల మీద క్రిమినల్ కేసు నమోదు చెయ్యాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈసారి గాలి జనార్దన్ రెడ్డి మీద కర్ణాటక లోకాయుక్త అధికారులు ఫిర్యాదు చేశారు.

మాజీ సీఎం జనార్దన్ రెడ్డి తోపాటు ఆయన సమీప బంధువు శ్రీనివాస్ రెడ్డి, ఆలీ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బీ. నాగేంద్ర తదితరుల మీద కేసు నమోదు చెయ్యాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు మాజీ ఐఆర్ ఎస్ అధికారుల మీద కేసులు నమోదు చెయ్యాలని కర్ణాటక లోకాయుక్త అధికారులు ప్రత్యేక కోర్టుకు మనవి చేశారు. అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయ్యే లోపు గాలి జనార్దన్ రెడ్డి మీద ఎలాంటి కేసులు నమోదు కాకూడదు దేవుడా అంటూ ఆయన అభిమానులు అంటున్నారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ!











Click it and Unblock the Notifications