ఆంధ్రా యువకులు, ఐటీ హబ్ లో కోచింగ్, కారులో వెళ్లారు. తమిళనాడు బస్సుతో ప్రాణం పోయింది !
ఆంధ్రా నుంచి బెంగళూరు వచ్చిన ఇద్దరు యువకులు కారులో వెలుతుంటే వాహనం అదుపుతప్పి తమిళనాడు బస్సును ఢీకొనడంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.
బెంగళూరు: ఓ యువకుడు బీఇ పూర్తి చేసి మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చెయ్యాలని ఆశపడుతున్నాడు. ఇప్పటికే సాఫ్ట్ వేర్ కోర్స్ లో చేరిన యువకుడు క్లాస్ లకు హాజరు అవుతున్నాడు. మరో యువకుడు ఉన్నత చదువులు చదవాలని ఐటీ హబ్ చేరుకున్నాడు. ఇద్దరూ కారులో వెలుతున్న సమయంలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొనడంతో ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కారు ప్రమాదంలో చనిపోయిన ఇద్దరు యువకులు ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారే కావడంతో ఆ రెండు కుటుంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.

ఉద్యోగం కోసం బెంగళూరుకు వచ్చాడు
ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలోని బోమ్మనహళ్లికి చెందిన కార్తీక్ (23) అనే యువకుడు బీఇ పూర్తి చేసి బెంగళూరు చేరుకున్నాడు. బెంగళూరులోని కోరమంగలలోని ఓ పీజీలో నివాసం ఉంటున్న కార్తీక్ మంచి సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్నాడు. టెక్కీగా మంచి ఉద్యోగం చెయ్యాలని అనుకుంటున్న కార్తీక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ట్రైనింగ్ క్లాసులకు హాజరు అవుతున్నాడు.

ఇంటర్ చదువుతున్న అబ్బాయి
ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాషం జిల్లాకు చెందిన భగీరథ రెడ్డి (17) అనే యువకుడు బెంగళూరు చేరుకుని ప్రముఖ కాలేజ్ లో పీయూసీ (ఇంటర్) చదువుతున్నాడు. ఇంటర్ నుంచి మా అబ్బాయి భగీరథ రెడ్డి బాగా చదివితే ఇంజనీరింగ్ లో, తరువాత ఉన్న చదువుల్లో రాణిస్తాడని అతని కుటుంబ సభ్యులు అనుకున్నారు. భగీరథ రెడ్డి కోరమంగలలోని పీజీలో నివాసం ఉంటూ ప్రతిరోజు కోరమంగలలోని ప్రముఖ కాలేజ్ కు వెళ్లి వస్తున్నాడు.

కారు అదుపుతప్పి ఇద్దరి ప్రాణం పోయింది
వేకువ జామున 4.30 గంటల సమయంలో కార్తీక్, భగీరథ రెడ్డి కారులో బయలుదేరారు. కార్తీక్ కారు నడుపుతున్నాడని పోలీసులు అంటున్నారు. కారును అగ్రహార వైపు నడుపుతున్నారు. ఆ సందర్బంలో సిల్కల్ బోర్డ్ జంక్షన్ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ ను ఢీకొనిందని, అంతే వేగంగా రోడ్డు డివైడర్ ను దాటుకుని వెళ్లి తమిళనాడు బస్సు ఢీకొనిందని పోలీసులు అన్నారు.

ఆటైమ్ లో ఏం పని ?
ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన కార్తీక్, భగీరథ రెడ్డిని ఆసుపత్రికి తరలించామని, చికిత్స విఫలమై ఇద్దనూ చనిపోయారని మడివాళ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అయితే వేకువ జామున ఇద్దరు కారులో ఎందుకు బయలుదేరారు ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఉద్యోగం చెయ్యడినికి ఒక్కరు, చదువు కోవడానికి ఒక్కరు వచ్చి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ రెండు కుటంబాల్లో విషాదచాయలు నెలకొన్నాయి.












Click it and Unblock the Notifications