Bengaluru: వ్యక్తిగత విషయాలు మీడియాలో రాకుండా కోర్టులో స్టే తెచ్చుకున్న కేంద్ర మంత్రి, అందుకే !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడకు ప్రత్యర్థుల భయం పట్టుకుందని సమాచారం. తన గురించి వ్యక్తిగత విషయాలు, సమాచారం, తన పరువుకు భగంవాటిల్లే వార్తలు మీడియాలో రాకుండా కేంద్ర మంత్రి సదానందగౌడ కోర్టులో స్టే తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. తన గురించి మీడియాలో తప్పుడు సమాచారం ప్రసారం చెయ్యకుండా ఎందుకు కోర్టులో స్టే తెచ్చుకున్నానో అనే విషయంపై కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రమేష్ జారకిహోళి రాసలీలల సీడీ మీడియాలో ప్రసారం అయిన తరువాత ఆ రాష్ట్రానికి చెందిన చాలా మంది మంత్రులు, నాయకులు చాలా మంది ముందుగానే కోర్టులో స్టే తెచ్చుకున్నారు.

కేంద్ర మంత్రివర్గ విస్తరణ సమయంలో ?
కేంద్ర ప్రభుత్వం త్వరలో మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని ఇటీవల వెలుగు చూసింది. ఇలాంటి సమయంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడకు సీడీ భయం పట్టుకుందని సమాచారం. తన గురించి వ్యక్తిగత సమాచారం, తన పరువుకు భగంవాటిల్లే వార్తలు మీడియాలో రాకుండా కేంద్ర మంత్రి సదానందగౌడ కోర్టులో స్టే తెచ్చుకున్నారు.

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా
తన వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత సమాచారం, తనకు సంబంధించిన ఎలాంటి తప్పుడు కథనాలు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా చూడటానికి మీడియాకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మీడియాకు కోర్టు ఆదేశాలు
కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. కోర్టు పూర్తి వివరాలు తెలుసుకుంది. కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ పరువుకు భంగం కలిగించే రీతిలో ఎవ్వరూ ఎలాంటి వార్తలు ప్రసారం చెయ్యకూడదని బెంగళూరు సిటీ సివిల్ కోర్టు అన్ని మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర మంత్రి క్లారిటీ
గత ఎన్నికల్లో తన ప్రత్యర్థులు రాజకీయంగా తనను ఎదుర్కోవడానికి అనేక ఎత్తులు వేశారని, ఇప్పుడు కూడా అలాంటి ఎత్తులు వేసి నకిలీ సీడీలు, నకిలి ఫోటోలు, వీడియోలు మీడియాకు విడుదల చెయ్యకుండా ముందుజాగ్రత్తగా తాను కోర్టును ఆశ్రయించానని కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ క్లారిటీ ఇచ్చారు.

మీడియా అంటే గౌరవం ఉంది..... ప్రత్యర్థులతో సమస్య !
మీడియా అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, మీడియాను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులు తన మీద ప్రతీకారం తీర్చుకోవడానికి నకిలీ వీడియోలు తెరమీదకు తెచ్చే అవకాశం ఉందని అనుమానంతో తాను కోర్టులో స్టే తెచ్చుకున్నానని, అంతకు మంచి తనకు ఎలాంటి సమస్యలు లేవని కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు డీవీ సదానందగౌడ వివరణ ఇచ్చారు. మొత్తం మీద కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపడుతున్న సమయంలో కేంద్ర మంత్రి డీవీ. సదానందగౌడ కోర్టులో స్టే తెచ్చుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications