పంజాబ్ ఆప్ సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్..?

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పార్టీలు దూసుకెళ్తున్నాయి. ఆప్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అన్నట్టు ప్రచారం చేస్తున్నాయి. ఆప్ ఒకడుగు ముందు వేసింది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా సీఎం అభ్యర్థిని కూడా కన్ఫామ్ చేసింది.ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ప్రస్తుతం పంజాబ్ ఆప్ శాఖ అధ్యక్షుడిగా ఉన్నారు.

సంగ్రూర్ ఎంపీ కూడా అయిన భగవంత్ మాన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆప్ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. వచ్చే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోనే పోరాడాలని సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటన ఆలస్యం కావడానికి కారణం ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు మంగళవారం ఉదయం కోవిడ్-19 పాజిటివ్ రావడమేనని తెలుస్తోంది.

Bhagwant Mann likely to be AAPs CM candidate for Punjab elections

గత నెలలో భగవంత్ మాన్ బీజేపీపై తీవ్ర ఆరోపణ చేశారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరితే భారీగా డబ్బు, కేంద్ర కేబినెట్‌లో మంత్రి పదవి ఇస్తామని ఓ సీనియర్ బీజేపీ నేత తనకు చెప్పారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇటువంటి ఆశలు పెట్టిన బీజేపీ నేత ఎవరో బహిరంగంగా చెప్పాలని భగవంత్ మాన్‌ను డిమాండ్ చేసింది. ఈ క్రమంలోనే ఆప్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఇటీవల ప‌ంజాబ్ కాంగ్రెస్ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్దూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్యేలు త‌లుచుకుంటే పోలీసుల ఫ్యాంట్లు త‌డిచిపోయేలా చేయ‌గ‌ల‌ర‌ని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. త‌మ పార్టీ ఎమ్మెల్యేల‌ను ప్ర‌శంసించే క్ర‌మంలో ఆయ‌న కామెంట్స్ చేశారు. దీంతో ఆయ‌న పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. పోలీసులు ఆయ‌న పై ప‌రువు న‌ష్టం దావా వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. దీనిపై మీడియా ప్రతినిధులు సిద్దూను ప్ర‌శ్నించగా.. ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు. ఈ క్రమంలో సీఎ్ చన్నీ సమర్థించే ప్రయత్నం చేశారు. పోలీసులకు అనుకూలంగా కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+