రూ. కోటి లంచం, రాజీనామాకు సిద్దం: రావ్
బెంగళూరు: కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తి వై. భాస్కర్ రావ్ కుమారుడి మీద పలు ఆరోపణలు వచ్చాయి.
కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన కుమారుడి మీద వచ్చిన ఆరోపణలు రుజువు అయితే వెంటనే తాను రాజీనామా చేస్తానని భాస్కర్ రావ్ స్పష్టం చేశారు.
అక్రమ ఆస్తుల మీద దాడులు జరకుండా ఉండాలంటే రూ. ఒక కోటి లంచం ఇవ్వాలని బెంగళూరు నగర జిల్లా పంచాయితీ సీనియర్ ఇంజనీరు కృష్ణమూర్తిని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. లోకాయుక్త కార్యాలయానికి పిలిపించిన అశ్విన్ రావ్ అనే ఆయన బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

లోకాయుక్త న్యాయమూర్తి కుమారుడు అశ్విన్. ఈ కేసు దర్యాప్తును బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు. అయితే కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించాలని పలువురు డిమాండ్ చేశారు. సీసీబీ పోలీసు అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సందర్బంలో భాస్కర్ రావు శుక్రవారం లోకాయుక్త కార్యాలయంలో మీడియాతో మట్లాడారు.
తన కుమారుడు అశ్విన్ కు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన కుమారుడు అశ్విన్ రూ. ఒక కోటి లంచం డిమాండ్ చెయ్యలేదని అన్నారు. తప్పు చేశాడని వెలుగు చూస్తే అశ్విన్ శిక్ష అనుభవిస్తాడని అన్నారు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లా శ్రీరాంపురకు చెందిన వై భాస్కర్ రావ్ కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తిగా పని చేస్తున్నారు. గతంలో ఆయన కర్ణాటక హై కోర్టు చీఫ్ జస్టిస్ గా పని చేశారు. అనంతరం పలు కీలకమైన పదవులలో కొనసాగారు. 2013 ఫిబ్రవరి 13వ తేదిన కర్ణాటక లోకాయక్త న్యాయమూర్తిగా నియమించారు.
భాస్కర్ రావ్ కు హైదారబాద్ లోని ఆదర్శనగర్ లో సోంత ఇళ్లు, బ్యాంకు అకౌంట్లు, కరీంనగర జిల్లాలోని శ్రీరాంపురలో పొలాలు ఉన్నాయి. కర్ణాటక లోకాయుక్త న్యాయమూర్తిగా భాస్కర్ రావ్ ను నియమించిన సమయంలో న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు సుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు.












Click it and Unblock the Notifications