రాహుల్‌తో నితీశ్ భేటీ.. జోడో యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాధాన్యం..
బీజేపీకి వ్యతిరేకంగా బీహర్ సీఎం నితీశ్ కుమార్ పావులు కదుపుతున్నారు. ఇటీవల బీజేపీకి బై చెప్పి.. ఆర్జేడీతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ తాజాగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వీరిద్దరు వర్తమాన రాజకీయాలపై చర్చించారు. రాహుల్ గాంధీ- నితీశ్ కుమార్ భేటీ రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
నితీశ్ కుమార్ సోమవారం ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఆయన కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు జరిగాయి. మొన్నటిదాకా బీజేపీతో జత కట్టి బీహార్‌లో ప్రభుత్వాన్ని నడిపిన నితీశ్... ఇటీవలే బీజేపీతో తెగదెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. నితీశ్ కుమార్... రాహుల్ గాంధీతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాహుల్ గాంధీ ఎల్లుండి నుంచి భారత్ జోడో యాత్ర పేరుతో కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ యాత్రకు ముందు రాహుల్‌తో నితీశ్ కుమార్ భేటీ అయ్యారు. రాహుల్ గాంధీ సుదీర్ఘ పాదయాత్రపై చర్చ జరిగినట్లు సమాచారం.
వీరిద్దరీ భేటీతో.. బీజేపీయేతర కూటమిపై చర్చ జరిగింది. యూపీఏలో జేడీయూ చేతులు కలుపుతుందా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ రెండు కలిసి పనిచేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications