ఎంఎల్ఏ నన్ను కిడ్నాప్ చెయ్యలేదు: యువతి
పాట్నా: బీహార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు సిద్దార్థ్ సింగ్ తనను కిడ్నాప్ చెయ్యలేదని, తాను పెళ్లి చేసుకోవడానికి ప్రియుడితో కలిసి వెళ్లానని అదృశ్యం అయిన బీహార్ యువతి నిధి (20) పోలీసు అధికారుల ముందు హాజరై వాగ్మూలం ఇచ్చింది.
తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నందుకు ఇంటి నుంచి పారిపోయానని నిధి అంటున్నది. పాట్నా సీనియర్ ఎస్పీ మను మహారాజ్ మీడియాకు వివరాలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు సిద్దార్థ్ సింగ్ తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని నిధి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు శాసన సభ్యుడి మీద కేసు నమోదు చేశారు. అయితే నిధి శాసన సభ్యుడు సిద్దార్థ్ సింగ్ కారు డ్రైవర్ పంకజ్ శర్మతో కలిసి పాట్నా సీనియర్ ఎస్పీ మను మహారాజ్ ముందు ప్రత్యక్షం అయ్యింది.

పంకజ్ శర్మ తన బాయ్ ఫ్రెండ్ అంటు పోలీసు అధికారులకు పరిచయం చేసింది. మాకు రెండేళ్ల నుంచి పరిచయం ఉందని, ఇద్దరూ ప్రేమించుకున్నామని అన్నారు. అయితే తన తండ్రి 50 ఏళ్ల వ్యక్తితో వివాహం చెయ్యడానికి సిద్దం అయ్యారని నిధి ఆరోపించింది.
ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక తాను పంకజ్ శర్మతో కలిసి పారిపోయానని, ఇందులో శాసన సభ్యుడు సిద్దార్థ్ సింగ్ కు ఎలాంటి సంబంధం లేదని నిధి చెప్పిందని మను మహారాజ్ అన్నారు. పంకజ్ శర్మ, నిధి ఇద్దరూ వివాహం చేసుకున్నారని మను మహారాజ్ వివరించారు. నిధికి వైద్య పరిక్షలు చేయించామని ఆయన చెప్పారు.
తరువాత మీడియా ముందు మాట్లాడిన నిధి అనవసరంగా ఈ విషయంలో శాసన సభ్యుడు సిద్దార్థ్ సింగ్ మీద కేసు పెట్టారని విచారం వ్యక్తం చేసింది. తను 50 ఏళ్ల వ్యక్తితో తన కుమార్తె వివాహం చెయ్యాలనుకోలేదని నిధి తండ్రి అంటున్నారు.
-
గ్రేట్ సార్.. ట్యాంక్ బండ్ శివకు అండగా సీఎం రేవంత్ ! -
అన్నీ సీఎం, మంత్రులకేనా - కోమటిరెడ్డి సంచలనం..!! -
సభాపర్వం: హేట్ స్పీచ్ బిల్లుపై రచ్చ.. బీజేపీ, బీఆర్ఎస్ వాదన ఇదే! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్












Click it and Unblock the Notifications