గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన సీఎం
Nitish Kumar: బిహార్ రాజకీయాలు మలుపు తిరిగాయి. అధికారంలో ఉన్న మహాకూటమి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ కూటమి నుంచి బయటికి రావాలని జనతాళ్ (యునైటెడ్) నిర్ణయించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంది.
జేడీయూ- రాష్ట్రీయ జనతాదళ్- కాంగ్రెస్ మహా ఘట్‌బంధన్ సంకీర్ణ ప్రభుత్వానికి సారథ్యాన్ని వహిస్తోన్న ముఖ్యమంత్రి నితీష్ కుమార్.. రాజీనామా చేయబోతోన్నారు. రాజకీయ అనిశ్చితికి తెరదించనున్నారు. తన రాజీనామా పత్రాన్ని అందజేయడానికి గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరారు.

అపాయింట్‌మెంట్ లభిస్తే- ఈ ఉదయమే ఆయన గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కలుస్తారు. తన రాజీనామా పత్రాన్ని అందజేస్తారు. అనంతరం ఎన్డీఏ కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. తనకు మద్దతు ఇవ్వనున్న జేడీయూ, బీజేపీ- దాని మిత్రపక్షాల శాసన సభ్యుల సంతకాలతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేస్తారు.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమ కూటమిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. ఈ ఉదయం 10 గంటలకు జేడీయూ శాసనసభా పక్షం సమావేశం కానున్న విషయం తెలిసిందే. దీన్ని ముగించుకున్న వెంటనే నితీష్ కుమార్ రాజ్‌భవన్‌కు బయలుదేరి వెళ్తారు.
243 స్థానాలు ఉన్న బిహార్ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్.. 122. జేడీయూకు 45 స్థానాలు ఉన్నాయి. బీజేపీకి ఉన్న 78, దాని మిత్రపక్షం హిందుస్తాన్ ఆవామీ లీగ్-4 స్థానాలను కలుపుకొంటే ఈ మేజిక్ ఫిగర్‌ను అందుకోగలుగుతుంది.
జేడీయూ, బీజేపీ, ఆవామీ లీగ్‌కు చెందిన 127 మంది సభ్యులు.. నితీష్ కుమార్ నాయకత్వాన్ని సమర్థించడం ఖాయంగా కనిపిస్తోంది. తనకు మద్దతు ఇస్తోన్న సభ్యులతో కూడిన పత్రాన్ని గవర్నర్‌కు అందజేసిన అనంతరం ఆయన ఆహ్వానం మేరకు ఆదివారం సాయంత్రం 4 గంటలకు మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications