చేతిలో చెంబు ఎందుకు పెట్టావ్, లోక్ సభ ఎన్నికల్లో చెంబు రాజకీయాలు, దెబ్బకు వైరల్ !
లోక్‌సభ ఎన్నికల వేళ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు తారాస్థాయికి చేరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోదీ చెంబు ప్రకటనలు, ఆరోపణలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకకు మోదీ సర్కార్ ఇచ్చింది చేతికి చెంబు అంటూ సిద్దరామయ్య ప్రభుత్వం ఆరోపణలు చేస్తోంది.
కాంగ్రెస్ నాయకుల ఆరోపణలపై కర్ణాటక బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. కాంగ్రెస్ ఆరోపణలపై స్పందించిన కర్ణాటక బీజేపీ సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆరో. అశోక్ మాట్లాడుతూ కావేరి వివాదంపై కాంగ్రెస్ నాయకులు కన్నడిగులకు ద్రోహం చేశారని, కేవలం కన్నడిగులకు ఖాళీ చెంబు చేతిలో పెట్టి తమిళనాడులకు కావేరీ నీరు వదిలేస్తున్నారని ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఖాళీ చెంబు ఆరోపణలు చేసుకుంటూ లోక్ సభ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెంబుల ఫోటోలు పెట్టి ఒకరి మీద ఒకరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. కర్ణాటకలో ప్రధాన ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ కూడా కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు దీటుగా సమాధానం చెబుతూ వారిపై విరుచుకుపడుతున్నారు. చెంబు ఫోటో పెట్టిన ఆర్.అశోక్ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు.
బెంగుళూరు ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారని, అది మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం అని, కాంగ్రెస్ ప్రభుత్వం దయ వల్లనే కర్ణాటకలోని కావేరీ నీటిని తమిళనాడుకు మళ్లించారని, కావేరీ నీరు ఖాళీ కావడంతో కన్నడిగులకు ఖాళీ చెంబు మిగిలిందని బీజేపీ ఆరోపిచింది. కాంగ్రెస్ నాయకులు, ఆ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 60 ఏళ్లుగా మొసలి కన్నీరు కార్చి కావేరి నీటి విషయంలో కన్నడిగులకు తీరని అన్యాయం చేశారని, ఇప్పుడు మోదీని విమర్శించడానికి చెంబు రాజకీయం చేస్తున్నారని కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం మీద బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు. ఇదే నెల 26వ తేదీన బెంగళూరుతో సహ పలు జిల్లాలో మొదటి విడత లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరుగుతున్నన సందర్బంలో ఆ రాష్ట్రంలో చెంబు రాజకీయాలు హాట్ టాపిక్ అయ్యింది.












Click it and Unblock the Notifications