బీజేపీ తరఫున 'సోనియా గాంధీ' పోటీ.. కాంగ్రెస్‌కు టెన్షన్!
కేరళలో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు ముందు బీజేపీ ఓ పెద్ద మాస్టర్‌స్ట్రోక్ వేసింది. మున్నార్‌లో బీజేపీ పార్టీ ఓ మహిళా అభ్యర్థికి టికెట్ ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పెంచింది. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మున్నార్‌లోని నల్లతన్ని వార్డు(వార్డు నెం.16) నుంచి సోనియా గాంధీ అనే పేరున్న మహిళా అభ్యర్థిని నిలబెట్టింది. ఈ వ్యూహాత్మక నిర్ణయంతో నల్లతన్ని వార్డులో బీజేపీ విజయావకాశాలు గణనీయంగా పెరిగాయి. ఈ పరిణామం కాంగ్రెస్‌తో పాటు స్థానిక రాజకీయ పార్టీలలో కలకలం సృష్టించింది.
ఎవరీ బీజేపీ 'సోనియా గాంధీ'?
బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈ సోనియా గాంధీ 34 ఏళ్ల స్థానిక మహిళ. ఈమె దివంగత దురే రాజ్ కుమార్తె. ఆమె తండ్రి ఓ కార్మికుడు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అందుకే అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ గౌరవార్థం తన కూతురికి ఆ పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి దుకాణంలో పనిచేసిన సోనియా.. పెళ్లయిన తర్వాత ఆమె ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఈ క్రమంలో ఆమె బీజేపీలో చేరారు.

భర్త కూడా బీజేపీ సభ్యుడే..
సోనియా గాంధీ భర్త సుభాష్ కూడా బీజేపీ సభ్యుడే. ఆయన మున్నార్ పంచాయతీలో బీజేపీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. భర్త ప్రభావంతోనే సోనియా గాంధీ బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కేరళ పంచాయతీ ఎన్నికలు సోనియా గాంధీ జీవితంలో మొదటి ఎన్నిక. నల్లతన్ని వార్డు (వార్డు నెం. 16) నుంచి ఆమె పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సోనియాకు కాంగ్రెస్ తరఫున మంజుల రమేష్, సీపీఐ(ఎం) తరఫున వలార్మతి పోటీగా ఉన్నారు.
బీజేపీ వ్యూహం ఏమిటి?
సోనియా గాంధీకి టికెట్ ఇవ్వడం వెనుక బీజేపీ వ్యూహం ఆమె పేరును ఉపయోగించుకోవడమే. చాలా మంది ఓటర్లు బీజేపీ అభ్యర్థి 'సోనియా గాంధీ'ని, కాంగ్రెస్ పార్టీకి చెందిన సోనియా గాంధీగా పొరబడే అవకాశం ఉంది. ఈ గందరగోళం బీజేపీకి ఎన్నికల్లో లాభం చేకూర్చవచ్చని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications