ఓట్లకోసమే తెరపైకి సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు: కాంగ్రెస్
ఏడాదినర్ర క్రితం అంటే 2016లో పాకిస్తాన్‌పై జరిగిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో,పలు టీవీ ఛానెళ్లలో ప్రసారం అవడంతో కాంగ్రెస్ బీజేపీల మధ్య దుమారానికి దారి తీసింది. ఈ వీడియోలను బీజేపీ విడుదల చేసిందని తద్వారా రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ఆరోపించారు.
సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన ఏడాదినర్రకు వీడియోలు దర్శనమివ్వడంపై కాంగ్రెస్ మండిపడింది. ఉగ్రవాదులకు సంబంధించిన లాంచ్ ప్యాడ్‌లను భారత కమాండోలు ధ్వంసం చేస్తున్నప్పటి దృశ్యాలు కలిగిన వీడియోను పలు టీవీ ఛానెళ్లు ప్రసారం చేశాయి. అంతేకాదు పాక్ గడ్డపై ఉగ్రవాదులను మట్టుబెట్టడం, వారి బంకర్లను ధ్వంసం చేయడం వంటివి డ్రోన్ల సహాయంతో చిత్రీకరించారు.

భారత జవాన్లు చేసిన ఈ సాహసాన్ని చూపి ఓట్లు పిండుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోందని కాంగ్రెస్ మండిపడింది. జవాన్ల త్యాగాన్ని ఓట్ల కోసం వాడుకోరాదని కాంగ్రెస్ సూచించింది. జవాన్లు ప్రాణ త్యాగం చేస్తే... మోడీ ఆ క్రెడిట్‌ను తీసుకోవడం సరికాదన్నారు. జై జవాన్..జై కిసాన్ నినాదాన్ని మోడీ దుర్వినియోగిస్తున్నారని కాంగ్రెస్ దుయ్యబట్టింది. వాజ్‌పాయి హయాంలోకాని, మన్మోహన్ సింగ్ హయాంలో కానీ పాకిస్తాన్‌పై విజయం సాధిస్తే వారు తమ ప్రభుత్వం గొప్పతనమని ఏ రోజైనా చెప్పుకున్నారా అని దేశం ప్రశ్నిస్తోందని సూటిగా అడిగింది కాంగ్రెస్.
-
రేపే సెలక్షన్స్, అగ్నివీర్ ర్యాలీ పూర్తి షెడ్యూల్. ఈ డాక్యుమెంట్స్ మర్చిపోవద్దు! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్‌తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్












Click it and Unblock the Notifications