మాజీ సీఎంకు లక్కీచాన్స్, చివరి నిమిషంలో హైకమాండ్ నిర్ణయం, అమిత్ షా ఎంట్రీతో !

లోక్‌సభ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల టిక్కెట్టును కోల్పోయిన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ శెట్టర్‌కు బెళగావి లోక్‌సభ టికెట్ దక్కడం దాదాపు ఖారారు అయ్యింది. బెళగావి సిట్టింగ్ ఎంపీ మంగళ సురేష్ అంగడికి బీజేపీ షాక్ ఇచ్చింది. బీజేపీ రెండో జాబితాలో తన పేరు లేకపోవడంతో మాజీ సీఎం జగదీష్ శెట్టర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.

గురువారం రాయచూరు పర్యటనను రద్దు చేసుకుని హుబ్బళిలోని బంధువులతో మాజీ సీఎం శెట్టర్ చర్చలు జరిపారు. అనంతరం జగదీష్ శెట్టర్, ఆయన కుటుంబ సభ్యులు బెంగళూరు చేరుకుని మాజీ సీఎం బీఎస్‌ యడ్యూరప్పను కలిశారు. రెండో జాబితాలో బెళగావి నుంచి తమ పేరు ప్రకటించకపోవడంతో ఆనియోజక ఆశించిన మంజుల అంగడి ఢిల్లీకి వెళ్లి కేంద్ర బీజేపీ హైకమాండ్‌ను కలిశారు.

BJP high command giving Belagavi MP seat to former Karnataka CM Jagdish Shetter

బెంగళూరులో మాజీ సీఎం శెట్టర్, బీఎస్. యడ్యూరప్ప భేటీ సందర్భంగా కర్ణాటక శాఖ బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర పాల్గొన్నారు. చర్చల సందర్భంగా బెళగావి ఎంపీ టిక్కెట్ విషయంలో చర్చలు జరిపిన తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి కాసేపు మాట్లాడారు. ధారవాడ టిక్కెట్ దక్కకపోవడంతో కలత చెందిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్‌లో మాట్లాడిన ఆయనను శాంతింపజేశారని తెలిసింది.

BJP high command giving Belagavi MP seat to former Karnataka CM Jagdish Shetter

హవేరి, ధారవాడ ఎంపీ టిక్కెట్లను ఆశించిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ చివరికి బెళగావి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పుడు శెట్టర్‌కు బెళగావి టికెట్ ఇవ్వాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. దీంతో బీజేపీ హైకమాండ్ నేతల నిర్ణయంతో బెళగావి సిట్టింగ్ బీజేపీ ఎంపీ మంజుల అంగడి టిక్కెట్ గల్లంతు కానుంది.బీజేపీ హైకమాండ్ ఆదేశాల మేరకు జగదీష్ శెట్టర్ బెళగావి నుంచి బరిలోకి దిగేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు.

స్వయంగా బెళగావి లోక్ సభ నియోజకవర్గం టికెట్ ఆశించిన మంజుల అంగడిని కాదని మాజీ సీఎం శెట్టర్ కు సమాచారం అందించారు. ఢిల్లీ నుంచి బెళగావికి తిరిగి వచ్చిన తర్వాత రెండో జాబితాలో మా కుటుంబం పేరు కనిపించడం లేదని మంజుల అంగడి విలేకరులకు చెప్పారు. తనకు ఎంపీ టిక్కెట్ ఇస్తామని బీజేపీ హైకమాండ్ ఇంత వరకు హామీ ఇవ్వలేదని బీజేపీ ఎంపీ మంజుల అంగడి మీడియాకు చెప్పారు. సిట్టింగ్ ఎంపీ మంజల అంగడి వ్యాఖ్యలతో మాజీ సీఎం జగదీష్ శెట్టర్‌కు బెళగావి ఎంపీ టికెట్ ఇవ్వడం ఖాయమని బీజేపీ నాయకులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+