డిసైడ్ చేసుకోలేని ఢిల్లీ, కేంద్ర మంత్రి ఎంట్రీ ?, మాజీ సీఎం సైలెంట్, మోదీ మార్క్ రాజకీయంతో!

బెంగళూరు: మూడేళ్లపాటు కర్ణాటక రాష్ట్రాన్ని పాలించిన బీజేపీ (BJP) తరువాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత కర్ణాటక బీజేపీని హైకమాండ్ పట్టించుకోలేదన్న చర్చ బీజేపీ (BJP) శిబిరంలో మొదలైంది. సొంతంగా అధికారంలోకి రావాల్సిన బీజేపీ ఘోర పరాజయం చవిచూసి సుమారు ఐదు నెలలైనా కర్ణాటక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేతను ఎన్నుకోలేదనే బీజేపీ హైకమాండ్ మీద కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది.

ఈ రెండు పదవుల ఎంపికలో జాప్యంపై బీజేపీ (BJP) నేతలే స్వయంగా హైకమాండ్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. బడ్జెట్‌ సమావేశాలు కూడా తొలిసారి ప్రతిపక్ష నేత లేకుండానే జరిగాయి. ఈ విషయంపై రాష్ట్ర కాంగ్రెస్ (congress) నేతలు బీజేపీ (BJP) మీద పలు విమర్శలు చేశారు. ఈ విషయంపై కర్ణాటక బీజేపీ నాయకులు చాలా ఇబ్బంది పడ్డారు.

BJP high command is unable to decide on the selection of the BJP Karnataka state president

ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్ణాటక బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడి (president) పదవికి కేంద్ర మంత్రిని నియమించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించిందన వెలుగు చూసింది. కేంద్ర మంత్రి (minister) , కర్ణాటక లేడీ ఫైర్ బ్రాండ్ శోభా కరంద్లాజేని కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా (president)నియమిస్తారని బీజేపీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బెంగళూరు (Bengaluru) నార్త్ లోక్‌సభ నియోజకవర్గం సీటు మాజీ ముఖ్యమంత్రి సదానందగౌడకు దక్కదని జోరుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడి (president)ఎన్నిక ఆలస్యం కావడంపై మాజీ సీఎం సదానంద గౌడ హైకమాండ్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. కర్ణాటక బీజేపీ (BJP) రాష్ట్ర అధ్యక్ష (president) పదవి కోసం మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ సదానందగౌడ బహిరంగంగా డిమాండ్ చేయకపోయినా ఆ పదవి తనకు కావాలని హైకమాండ్ మీద ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది.

BJP high command is unable to decide on the selection of the BJP Karnataka state president

మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప (BSY)ఆయన కుమారుడు, శికారిపుర ఎమ్మెల్యే బీవై విజయేంద్రకు కర్ణాటక (Karnataka) రాష్ట్ర బీజేపీ అధ్యక్ష (president) పదవి ఇప్పించే విషయమై హైకమాండ్ నేతలతో చర్చించినట్లు తెలిసింది. అయితే హైకమాండ్ నేతలు ఇప్పటికే చర్చలు జరిపి కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే పేరు ఖరారు చెయ్యాలని డిసైడ్ అయ్యారని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న యడియూరప్ప కర్ణాటక బీజేపీ అధ్యక్షుడి పదవి విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+