Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అసెంబ్లీ ఎన్నికల ముందే అక్కడ పవర్ పోగొట్టుకున్న బీజేపీ, కౌంట్ డౌన్

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా గుజరాత్ ప్రయోగం కర్ణాటకలో ప్రయోగించిన బీజేపీ నాయకులకు సినిమా కనపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటోయో కాని ఇప్పడు విధాన పరిషత్ (ఎమ్మెల్సీలు)లో బీజేపీ మెజారిటీని కోల్పోవడంతో ఆ పార్టీ నాయకులు షాక్ మీద షాక్ తగిలి అయోమయంలో పడిపోయారు.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వడానికి బీజేపీ నిరాకరించడంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు వరుస రాజీనామాలు చేస్తున్నారు. 2019లో కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ల సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయి బీజేపీ అధికారంలోకి రావడానికి కారణం అయిన నాయకుల్లో ఒక్కడైన ఆర్. శంకర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యడంతో అక్కడ తిరుగుబాటు మొదలైయ్యింది.

 karnataassembly

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ హైకమాండ్ విడుదల చేసిన వెంటనే ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదని కోపంతో బీజేపీ ఎమ్మెల్సీలు పుట్టణ్ణ, బాబారావ్ చించనూర్ వారి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వారి బాటలోనే మరో బీజేపీ ఎమ్మెల్సీ ఆర్. శంకర్ కూడా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యడంతో విధాన పరిషత్ లో బీజేపీ మెజారిటీని కోల్పోయింది.

ఇప్పుడు కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవది సైతం శుక్రవారం సాయంత్రం ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారు. విధాన పరిషత్ అధ్యక్షుడు బసవరాజ్ హోరట్టి ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ పత్రికతో మాట్లాడారు. కర్ణాటకలో విధాన పరిత్ లో బీజేపీ మెజారిటీని కోల్పోయిందని బసవరాజ్ హోరట్టి అంగీకరించారని ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ స్పఫ్టం చేసింది.

 karnataka-legislative-assembly-

2018లో కర్ణాటక విధాన పరిషత్ లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు మెజారీ సభ్యులతో విధాన పరిషత్ లో తన బలం నిరూపించుంది. తరువాత జరిగిన పరిణామాలతో 2022లో విధాన పరిషత్ తో బీజేపీ తన బలాని 39కి పెంచుకుంది. విధాన పరిషత్ లో 38 మంది సభ్యులు ఉంటే వారిదే ఆధిపత్యం. కర్ణాటకలో మొత్తం 75 ఎమ్మెల్సీ సభ్యలు ఉన్నారు.

2022లో బీజేపీ 39 సభ్యులతో విధాన పరిషత్ లో పాగవేసింది. ఇప్పుడు వరుసగా ముగ్గురు బీజేపీ ఎమ్మెల్సీలు రాజీనామా చెయ్యడంతో బీజేపీ బలం 35కు పడిపోయింది. ఇక లక్ష్మణ సవది రాజీనామా చేస్తే కథ మరోలా ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే విధాన పరిషత్ లో ప్రతిపక్షాలు మెజారీతో మంచి జోష్ మీద ఉన్నాయి.

కర్ణాటక విధాన పరిషత్ లో మొత్తం 75 స్థానాలు ఉన్నాయి. ఒక్కరు సభాపతి (విధాన పరిషత్ అధ్యక్షుడు) కాగా ప్రస్తుతం బీజేపీకి 35 మంది ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ కు 26 మంది ఎమ్మెల్సీలు, జేడీఎస్ కు 8 మంది ఎమ్మెల్సీలు, ఒకరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్సీ ఉన్నారు. విదాన పరిషత్ లో మెజారిటీని కోల్పోవడం బీజేపీకి ఒక రకంగా పెద్ద మైనస్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+