హైదరాబాద్ నుంచి నేరుగా మైసూరుకు: కాచిగూడ-బెంగళూరు ఎక్స్ ప్రెస్ పొడిగింపు

మైసూరు: కాచిగూడ-బెంగళూరు మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును మైసూరు వరకు పొడిగించారు. మైసూరు రైల్వేస్టేషన్ లో మంగళవారం ఈ రైలు పట్టాలు ఎక్కింది. మైసూర్ లోక్ సభ సభ్యుడు ప్రతాప సింహ జెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు.

BJP MP Pratap Simha flags of extended Mysuru-Kacheguda Express

సవరించిన షెడ్యూల్ ఇదీ..

ప్రతిరోజూ సాయంత్రం 7:05 నిమిషాలకు కాచిగూడ నుంచి బయలుదేరే నంబర్ 12785 ఎక్స్ ప్రెస్ మరుసటి రోజు తెల్లవారు జామున 6:25 నిమిషాలకు బెంగళూరు క్రాంతివీర సంగోళి రాయణ్ణ బెంగళూరు స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 6:40 నిమిషాలకు బయలుదేరి ఉదయం 9:40 నిమిషాలకు మైసూరుకు చేరుకుంటుంది.

BJP MP Pratap Simha flags of extended Mysuru-Kacheguda Express

అదే రోజు మధ్యాహ్నం 2:45 నిమిషాలకు మైసూరు నుంచి బయలుదేరే నంబర్ 12786 ఎక్స్ ప్రెస్ సాయంత్రం 5:40 నిమిషాలకు బెంగళూరు స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి 6:20 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు జామున 5:40 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది.

BJP MP Pratap Simha flags of extended Mysuru-Kacheguda Express

చాలారోజుల నుంచి కాచిగూడ ఎక్స్ ప్రెస్ ను మైసూరు వరకు పొడిగించాలని తాము డిమాండ్ చేస్తున్నామని మైసూర్ ఎంపీ ప్రతాప సింహ తెలిపారు. ఎట్టకేలకు తమ డిమాండ్ కార్యరూపం దాల్చిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+