బీజేపీ 4వ జాబితా విడుదల: నటి రాధికకు టికెట్ ఖరారు, ఎవరితో తలపడాలంటే?
లోక్‌సభ ఎన్నికల కోసం నాల్గవ జాబితాను విడుదల చేసింది భారతీయ జనతా పార్టీ. 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. పుదుచ్చేరిలో 1 సీటు, తమిళనాడులో 14 సీట్లకు అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. కాగా, ప్రముఖ సినీనటి రాధిక శరత్ కుమార్ బీజేపీ టికెట్ దిక్కింది. తమిళనాడులోని విరూధునగర్ నుంచి రాధిక పోటీ చేయనున్నారు. అయితే, రాధికకు ప్రత్యర్థి పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది.
అన్నాడీఎంకే పొత్తులో భాగంగా విరుదునగర్ టికెట్‌ను డీఎండీకేకు కేటాయించింది. ఆ పార్టీ నుంచి విజయ ప్రభాకరన్ పోటీ చేయనున్నారు. ఆయన డీఎండీకే వ్యవస్థాపాకుడు, దివంగత నేత కెప్టెన్ విజయవాకంత్ కుమారుడు కావడం గమనార్హం. మరోవైపు, విరుదునగర్ నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీగా మాణికం ఠాగూర్ ఉన్నారు. దీంతో రాధికకు ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల నుంచి గట్టిపోటీ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల రాధిక భర్త ఆర్ శరత్ కుమార్ తన పార్టీ ఏఐఎస్ఎంకేని బీజేపీలో విలీనం చేసిన విషయం తెలిసిందే.

నాల్గవ జాబితా అభ్యర్థుల జాబితా:
తిరువళ్లూరు: పొన్ వి బాలగణపతి
చెన్నై నార్త్: ఆర్సీ పాల్ కనగరాజ్
తిరువన్నామలై: ఎ అశ్వత్థామన్
నమక్కల్: కేపీ రామలింగం
తిరుప్పూర్: ఏపీ మురుగనందం
పొల్లాచ్చి: కే వసంతరాజన్
కరూర్ం వీవీ సెంథిల్ నాథన్
చిదంబరం: పీ కాత్యాయని
నాగపట్టిణం: ఎస్‌జీఎం రమేశ్
తంజావూరుం: ఎం మురుగనందం
శివలింగ: దేవనాథన్ యాదవ్
మదురై: రామ శ్రీనివాసన్
విరుదునగర్: రాధికా శరత్ కుమార్
తెన్ కాశీ: జాన్ పాండియన్

గతంలో 195 మందితో తొలి జాబితా, ఇటీవల 72 మందితో రెండో జాబితా, 9 మందితో జాబితాను బీజేపీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో 15 మందితో నాలుగో జాబితాను ప్రకటించింది. మొత్తం 291 స్థానాల్లో బీజేపీ అభర్థులను ఖరారు చేసింది.
కాగా, 15 మంది అభ్యర్థుల జాబితాలో 2017లో బీజేపీలో చేరిన అన్నాడీఎంకే మాజీ ప్రముఖులు కార్త్యాయిని కూడా ఉన్నారు. కార్తాయిని తమిళనాడులోని చిదంబరం (ఎస్సీ) నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పుదుచ్చేరి నుంచి ఎ.నమశ్శివాయంను బీజేపీ పోటీకి దింపింది.












Click it and Unblock the Notifications