రాహుల్! నీ మాట మీవాళ్లే వినలేదు: ప్రజలకు కుమారస్వామి షాక్‌పై బీజేపీ
Recommended Video

బెంగళూరు: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే కర్ణాటక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలకు తొలి షాక్ ఇచ్చారు. విధాన సౌధలో తొలి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. ప్రజలపై పెట్రో బాంబు వేశారు. పెట్రోల్ ధరలను లీటర్‌కు రూ.1.14, డీజిల్ పైన రూ.1.12 వరకు పెంచనున్నట్లు ప్రకటించారు.పెట్రోల్‌పై పన్ను రేటును 30 శాతం నుంచి 32 శాతం వరకు, డీజిల్‌పై 19 శాతం నుంచి 21 శాతం వరకు పెంచుతున్నట్లు తెలిపారు.
కాగా, పెట్రోల్, డీజిల్ పైన పన్ను భారం మోపాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇంధన ఛార్జీలపై రాహుల్ గతంలో ప్రధాని మోడీకి విసిరిన సవాల్‌ను గుర్తు చేశారు. రాహుల్ గాంధీకి, కర్ణాటకలోని కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వానికి చురకలు వేసింది.

రాహుల్ గాంధీ విసిరిన ఇంధన సవాల్‌ను స్వీకరించేందుకు ఎవరూ ముందుకు రాలేదని, కనీసం ఆయన సొంత ప్రభుత్వం కూడా ఆ పని చెయ్యలేదని, ఏదైనా ఓ విషయం గురించి తెలియకుండా, తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా లేకుండా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయని బీజేపీ రాహుల్ గాంధీకి కౌంటర్ ఇచ్చింది.
ఓ వైపు పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గించాలని రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి సవాల్ చేయగా, స్వయంగా వారి సొంత ప్రభుత్వం రాష్ట్రంలో పెంచడం విమర్శలకు తావిచ్చింది. గతంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన సమయంలో రాహుల్ ప్రధాని మోడీకి ఇంధన సవాల్ విసిరారు. కోహ్లీ విసిరిన ఫిట్‌నెస్ ఛాలెంజ్ సవాలు స్వీకరించడమే కాదని, పెరిగిన ఇంధన ధరలను తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని, నా ఇంధన సవాల్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ - జేడీఎస్ ప్రభుత్వం ధరలు పెంచింది.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే! మీ నగరంలో రేటు ఎంత ఉందంటే? -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
పెట్రోల్ కొరత లేదు.. బంకుల్లో ఫుల్ స్టాక్! తేల్చిచెప్పిన ప్రభుత్వం -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు












Click it and Unblock the Notifications