బీజేపీ- శివసేన వార్: ఎమ్మెల్యేలపై బీజేపీ కన్నేసిందా..? చివరి అస్త్రం అదేనా..?

ముంబై: 25 మంది శివసేన ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌తో టచ్‌లో ఉన్నారని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కొద్దిరోజుల క్రితం చిన్న హింట్ ఇచ్చారు మహారాష్ట్ర స్వతంత్ర ఎమ్మెల్యే రవిరాణా. రవి రాణా వ్యాఖ్యలతో శివసేన అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే తమకున్న అనుమానంను బయటపెట్టింది. బీజేపీ తమ ఎమ్మెల్యేలను కొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోందని ఆరోపించింది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తీసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఎమ్మెల్యేలకు డబ్బు ఎర వేస్తోన్న బీజేపీ: సామ్నా

ఎమ్మెల్యేలకు డబ్బు ఎర వేస్తోన్న బీజేపీ: సామ్నా

శివసేన మాతృపత్రిక సామ్నాలో బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తోందని కథనం రాసుకొచ్చింది. అంతేకాదు మహారాష్ట్ర ప్రజలు ఉద్ధవ్ థాక్రే పార్టీ నుంచే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని పేర్కొంది. ఇక ప్రభుత్వం ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొన్న నేపథ్యంలో బీజేపీ గట్టెక్కేంందుకు అన్ని అస్త్రాలు ప్రయోగిస్తోందని ఇందులో డబ్బును కూడా విపరీతంగా వెదజల్లుతోందని సామ్నా తన కథనంలో ప్రచురించింది. కొత్తగా శివసేన నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలే లక్ష్యంగా ప్రలోభాలకు బీజేపీ దిగుతోందని సామ్నా పత్రికలో కథనం వచ్చింది. విలువలు లేని రాజకీయాలను శివసేన ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించబోదని ఎడిటోరియల్‌లో రాసుకొచ్చింది.

బీజేపీ అవినీతి ఏంటో శివసేన వ్యాఖ్యలతో అర్థమైంది: కాంగ్రెస్

బీజేపీ అవినీతి ఏంటో శివసేన వ్యాఖ్యలతో అర్థమైంది: కాంగ్రెస్

బీజేపీ సర్కార్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు డబ్బును వినియోగిస్తోందని అదే సమయంలో రాష్ట్రంలో పాలన ఆగిపోవడమే కాకుండా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న సంగతి మరిచిందని సామ్నాలో కథనం వెలువడింది. రైతు కన్నీళ్లు ఆగాలంటే ముఖ్యమంత్రి అభ్యర్థి శివసేన నుంచి ఉంటేనే బాగుంటుందన్న అభిప్రాయం మహారాష్ట్ర ప్రజల్లో కనిపిస్తోందని సామ్నా ఎడిటోరియల్‌లో వచ్చింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై కాంగ్రెస్ ప్రతినిధి సచిన్ సావంత్ స్పందించారు. శివసేన బీజేపీకి మొదటి నుంచి మిత్రపక్షమని.. ఇప్పుడు తమ ఎమ్మెల్యేలనే బీజేపీ కొనే ప్రయత్నం చేస్తుందని ఆ పార్టీ ఆరోపిస్తుంటే కమలం పార్టీ ఎంతగా అవినీతికి పాల్పడుతుందో అర్థమవుతోందని విమర్శించారు. అందుకే మహారాష్ట్రను బీజేపీ నుంచి కాపాడాలని అన్నారు. ఇంత స్థాయికి దిగజారిన బీజేపీ - శివసేనలకు ప్రభుత్వం ఏర్పాటు చేసే నైతిక హక్కు ఏముందని సచిన్ సావంత్ ప్రశ్నించారు.

మహారాష్ట్ర సమగ్రతను శివసేన కాపాడుతుంది

మహారాష్ట్ర సమగ్రతను శివసేన కాపాడుతుంది


బీజేపీకి చెందిన సుధీర్ ముంగన్‌తివార్ శుభవార్త వింటారని చెప్పారు కానీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్య గురించి మాత్రం ప్రస్తావించలేదని శివసేన ఎద్దేవా చేసింది. మహారాష్ట్రకు భంగం వాటిల్లేలా ఎవరూ ప్రవర్తించరాదని చెబుతూనే రాష్ట్ర సమగ్రతను కాపాడేందుకు శివసేన కత్తులు పట్టుకుని సిద్ధంగా ఉందని ఆ పార్టీ వెల్లడించింది. మరోవైపు బీజేపీతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా స్పష్టం చేసింది.

గవర్నర్‌ను కలవనున్న బీజేపీ బృందం

గవర్నర్‌ను కలవనున్న బీజేపీ బృందం

ఇక మహారాష్ట్ర అసెంబ్లీ నవంబర్ 9న ముగియనుండటంతో బీజేపీ గురువారం రోజున గవర్నర్ భగత్ సింగ్ కోష్యారిని కలవనుంది. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ నేతృత్వంలోని బీజేపీ బృందం గవర్నర్‌ను కలవనుంది. ఇక ఇదే సమయంలో బీజేపీ కొత్త చీఫ్‌ను ఎన్నుకునే ప్రక్రియ కూడా ప్రారంభమైందని ముంగన్‌తివార్ చెప్పారు. డిసెంబర్ 31 కల్లా కొత్త బీజేపీ చీఫ్ వస్తారని చెప్పారు.ఇక పాత అసెంబ్లీ గడువు ముగిసేలోపే మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని సుధీర్ ముంగన్‌తివార్ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+