బీజేపీదే మళ్లీ అధికారం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ జోస్యం

లక్నో : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగురవేయడం ఖాయమన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. ఈసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి పీఠమెక్కబోతున్నారని జోస్యం చెప్పారు. లక్నో లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన రాజ్‌నాథ్‌ సింగ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్థానిక స్కాలర్స్ స్కూల్‌లో సాధారణ ఓటర్ల మాదిరిగానే క్యూ లో నిలబడి ఓటేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో కూడా బీజేపీయే అధికారంలోకి వస్తుందని ఆకాంక్షించారు.

రెండు దశాబ్ధాలుగా లక్నోలో బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1991లో మాజీ ప్రధాని వాజ్‌పేయి ఇక్కడి నుంచే గెలుపొందారు. అలా అప్పటినుంచి ఇక్కడ బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. ఈసారి బీజేపీ తరపున రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నుంచి ఆచార్య ప్రమోద్, ఎస్పీ బీఎస్పీ కూటమి నుంచి శత్రుఘ్నసిన్హా భార్య పూనమ్ పోటీపడుతున్నారు.

BJP Will Get Clear Majority Rajnath Singhs Confident Message After Voting
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+