Leader: అర్దరాత్రి నడిరోడ్డులో అధికార పార్టీ లీడర్ హత్య, సీసీటీవీ కెమెరాల్లో, అంతరాత్రిలో ఏం జరిగింది ?
బళ్లారి/బెంగళూరు: మైనింగ్ హబ్ బళ్లారిలో మరోసారి రక్తపాతానికి తెరతీసింది. బీజేపీ నాయకుడు, బియ్యం వ్యాపారిని అర్దరాత్రి వెంటాడి చంపేశారు. బీజేపీ నాయకుడిని హత్య చేసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం బియ్యం వ్యాపారం చేస్తున్న యువకుడు గతంలో మట్కా బుక్కీగా పేరు తెచ్చుకున్నాడు. అర్దరాత్రి ఇద్దరు యువకులు బీజేపీ నాయకుడిని నడిరోడ్డులో దారుణంగా హత్య చేసి దర్జాగా కారులో వెళ్లిపోవడంతో బళ్లారిలో కలకలం రేపింది.

రాత్రి 2 గంటల సమయంలో ?
బళ్లారి సిటీలోని కౌల్ బజార్ లోని రేడియో పార్క్ సమీపంలో మంగళవారం అర్దరాత్రి 2 గంటల సమయంలో బీజేపీ నాయకుడు మంజునాథ్ అలియాస్ మట్కా మంజు (35) అనే వ్యక్తితో ఇద్దరు యువకులు మాట్లాడుతున్నారు. ఆ సందర్బంలో మంజునాథ్ కు ఇద్దరితో గొడవ జరిగింది. కొంతసేపు ముగ్గురు రోడ్డు మీద వాగ్వివాదానికి దిగారు.

సీసీటీవీ కెమెరాల్లో ?
ఆ సందర్బంలో రేడియో పార్క్ పరిసర ప్రాంతాల్లో వీది శునకాలు తప్పా ఎవ్వరూ సంచరించలేదు. ఆ సందర్బంలో బీజేపీ నాయకుడు, బియ్యం వ్యాపారి మంజునాథ్ ను ఆ ఇద్దరు యువకులు వెంటాడి చంపేశారు. బీజేపీ నాయకుడు మంజునాథ్ ను హత్య చేసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.

చంపేసి కారులో ఎస్కేప్
మంజునాథ్ ను హత్య చేసిన ఇద్దరు యువకులు కారులో ఎస్కేప్ అయ్యారు. బుధవారం వేకువ జామున రేడియో పార్క్ సమీపంలో వెలుతున్న వారు మంజునాథ్ హత్యకు గురైన విషయం గుర్తించి కౌల్ బజార్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీజేపీ కార్యకర్తలు గుమికూడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

గతంలో మట్కా బుక్కీ
అర్దరాత్రి ఇద్దరు యువకులు బీజేపీ నాయకుడు మంజునాథ్ ను నడిరోడ్డులో దారుణంగా హత్య చేసి దర్జాగా కారులో వెళ్లిపోవడంతో బళ్లారిలో కలకలం రేపింది. ప్రస్తుతం బియ్యం వ్యాపారం చేస్తున్న మంజునాథ్ గతంలో మట్కా బుక్కీగా పేరు తెచ్చుకున్నాడని పోలీసులు అంటున్నారు. మంజునాథ్ హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని బళ్లారి పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications